`ఇండియ‌న్ 2` మేకోవ‌ర్ కోసం కాజ‌ల్ పాట్లు.. మేక‌ప్‌కే అన్ని గంట‌లా..?

సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ఇండియన్(భారతీయుడు) చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. దాదాపు పాతికేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వల్ గా ఇండియన్ 2ను రూపొందిస్తున్నారు. అయితే ఏ ముహూర్తాన ఈ సినిమాను ప్రారంభించారో తెలియదు కానీ ఆరంభం నుంచి షూటింగ్ కు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి.

ఈ సినిమాను ప్రారంభించి రెండేళ్లు కావస్తోంది. ఇక ఫైనల్ గా అనేక అవాంత‌రాల‌ను దాటుకుని ఇటీవ‌లె షూటింగ్ ను రీస్టార్ట్ చేశారు. ప్రస్తుతం చెన్నైలో శర‌వేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబి సింహ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. లైకా – రెడ్ జెయింట్ సంస్ధలు కలిసి ఈ సినిమాను భారీ బాడ్జెట్ తో నిర్మిస్తున్నాయి.

ఇందులో 90 ఏళ్ల వృద్ధుడు స్వాతంత్య్ర‌ సమరయోధుడు సేనప‌తిగా కమలహాసన్ నటిస్తున్నారు. ఆయనకు భార్య పాత్ర‌ను కాజల్ అగర్వాల్ పోషిస్తోంది. అంటే కాజల్ భామ్మ‌ పాత్రలో క‌నిపించ‌బోతోంది. అయితే ఆ మేకోవర్ కాజ‌ల్‌ ఎన్నో పాట్లు పడుతుంద‌ట‌. మేకప్ కోసమే రోజుకు ఏకంగా మూడు గంటల సమయాన్ని వెచ్చిస్తుందట. ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్లు షాకైపోతున్నారు. ఏదైనా మూడు గంటలు కేటాయించి మేక‌ప్ వేసుకోవ‌డం అంటే మామూలు విషయం కాదనే చెప్పొచ్చు.

Share post:

Latest