జగన్ 175 కాన్సెప్ట్ వెనుక దొంగ ఓట్లు..!

గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చారు..కానీ ఈ సారి 175కి 175 సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించాలని జగన్ చూస్తున్నారు. అసలు తాము అధికారంలోకి వచ్చాక అన్నీ మంచి పనులే చేశాం కాబట్టి..ప్రజలంతా తమకే మద్ధతు ఇస్తారని, అసలు 175 సీట్లు ఎందుకు గెలవలేమని చెప్పి జగన్..పదే పదే తమ పార్టీ నేతలతో అంటున్నారు. మరి వైసీపీకి ప్రజలు 175 సీట్లు ఇస్తారా? అంటే అది ప్రజలు నిర్ణయించాలి.

ఎందుకంటే జగన్ పాలనని చూస్తుంది వారే..అయితే ప్రజలంతా జగన్ పాలన పట్ల సంతోషంగా ఉన్నారా? అంటే చెప్పడం కష్టమే. గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసిన వారే సంతోషంగా ఉన్నట్లు కనిపించడం లేదు. కాబట్టి పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయినా సరే 175 గెలిచేస్తామనే ధీమా వైసీపీ నేతల్లో ఉంది..ఏదేమైనా మళ్ళీ అధికారంలోకి వస్తామని భావిస్తున్నారు. అలా వైసీపీ నేతలు మళ్ళీ అధికారంలోకి వస్తామనే కాన్ఫిడెన్స్ వెనుక కారణం ఉందని, దొంగ ఓట్లతో మళ్ళీ అధికారంలోకి రావాలని వైసీపీ చూస్తుందని టి‌డి‌పి శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలని సైతం దొంగ ఓట్లతో గెలవాలని వైసీపీ చేసిన ప్రయత్నాలు చూస్తే..సాధారణ ఎన్నికల్లో కూడా అదే తరహాలో దొంగ ఓట్లతోనే గెలవాలని చూస్తారని అంటున్నారు. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో , కుప్పం మున్సిపాలిటీలో దొంగ ఓట్లతో వైసీపీ ఎలా గెలిచిందో తెలిసిందే అని, ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో..అసలు 7, 10 తరగతి చదివిన వారు కూడా ఓటు వేశారంటే..ఏ స్థాయిలో దొంగ ఓట్లు క్రియేట్ చేశారో చెప్పాల్సిన పని లేదని అంటున్నారు. ఆ దొంగ ఓట్ల అండతోనే రేపు 175 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకున్నారని ఫైర్ అవుతున్నారు.

Share post:

Latest