తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వయంకృషితో చిరంజీవి పైకి వచ్చిన హీరోగా అందరికీ సుపరిచితమే. చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని ఇప్పటికి ఎంతోమంది హీరోలు కూడా ఇలాగే ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే చిరంజీవి దాదాపుగా 154 కి పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నారు. అయితే అప్పట్లో ఎంతో మంది స్టార్ హీరోయిన్ల సరసన నటించిన చిరంజీవి అందరితో కూడా జత కట్టాలని చెప్పవచ్చు అయితే ఒకసారి హీరోయిన్ మెగాస్టార్ పైన చేయి చేసుకోవడం జరిగిందట వాటి గురించి తెలుసుకుందాం.
ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ తో చిరంజీవి నటించారు. అయితే ఆయనతో ఎక్కువగా నటించిన హీరోయిన్ రాధిక కూడా ఒకరు ఇద్దరు మంచి క్రేజీ ఉంది. అయితే ఒకానొక సందర్భంలో రాధిక, చిరంజీవిని చెంప దెబ్బ కొట్టినట్లు తెలుస్తోంది. ఒక సినిమా షూటింగ్ సమయంలో రాధిక, చిరంజీవి చంప దెబ్బ కొట్టే సన్నివేశం లో నటించాల్సి వచ్చిందట. అయితే ఎన్నిసార్లు ట్రై చేసిన ఆ షాట్ సరిగ్గా రాలేకపోవడంతో అప్పటికే చాలా టేకులు తీసుకుని విసుగిపోయిన డైరెక్టర్ ,రాధిక దీంతో చివరకు ఏం చేయాలో తెలియక..
ఒక్కసారిగా గట్టిగా కొట్టేసిందట దీంతో చిరంజీవి చంప ఎర్రగా మారిపోయిందట. షాట్ ఓకే అయినా కూడా రాధిక మాత్రం చాలా బాధపడిందట. అయితే ఇది గమనించిన చిరంజీవి ఏం పర్వాలేదు అది పెద్ద దెబ్బ కాదులే అని తెలిపారుట .అప్పటినుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉందని ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించారు చిరంజీవి రాధిక. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.