ఆ ఇద్దరే ఎన్టీఆర్ లైఫ్ ని మార్చేశారా..!!

టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రస్తుతం కెరియర్ పరంగా వ్యక్తిగతంగా అన్ని విషయాలలో కూడా బాగా కలిసొస్తున్నాయని చెప్పవచ్చు. ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రాలు అన్ని కూడా భారీ స్థాయిలో బిజినెస్ లు జరుగుతున్నాయి. ఇటీవలే RRR చిత్రంతో తారక్ ఆస్కార్ రేంజ్ లో కూడా నిలవడం జరిగింది. దీంతో ఎన్టీఆర్ నటన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది. ఈ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కు ఇద్దరు కొడుకులు ఉన్న సంగతి తెలిసిందే.

Jr NTR: Favourite of masses & family man

అందులో ఎన్టీఆర్ పెద్ద కొడుకు పేరు అభయ్ రామ్, చిన్న కుమారుడు పేరు భార్గవ్ రామ్. పెద్ద కొడుకు పుట్టిన తర్వాత ఎన్టీఆర్కు కలిసొచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. 2014 ముందు తారకు కొన్నేళ్లపాటు వరుసగా షాకులు తగిలాయి. తారక్ నటించిన పలు చిత్రాలు కూడా ఫ్లాప్ గానే నిలిచాయి .ఆ తర్వాత అబ్బాయి రామ్ పుట్టారు తారక్ నటించిన ప్రతి సినిమా కూడా సక్సెస్ను అందుకుంది. ఇక రెండవ కుమారుడు భార్గవ్ రామ్ పుట్టిన తరువాత ఎన్టీఆర్ రేంజ్ మరింత పెరిగిపోవడమే కాకుండా పాన్ వరల్డ్ రేంజ్ లో పాపులర్ అయ్యారు.

Jr NTR's Rs 25 Crore luxurious Hyderabad bungalow: 18 photos and videos  that take you inside the actor's abode | GQ India
అన్ని వర్గాల ప్రేక్షకులకు కథ నచ్చే విధంగా కథ పైన దృష్టి పెడుతున్నారు ఎన్టీఆర్.ఇతర హీరోల ఫ్యాన్స్ సైతం మెచ్చుకునే విధంగా అడుగులు వేస్తున్నారు ఎన్టీఆర్ మరి రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇద్దరు కొడుకులు పుట్టిన తరువాతే ఎన్టీఆర్ కోరుకున్న విధంగా తన లైఫ్ ముందుకు సాగుతోందని చెప్పవచ్చు.

Share post:

Latest