క‌ళ్లు చెదిరే రీతిలో `దసరా` బిజినెస్.. హిట్ కొట్టాలంటే నాని ఎంత రాబ‌ట్టాలి?

న్యాచుర‌ల్ స్టార్ నాని ఈ వారం సోలోగా తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించేందుకు రెడీ అయ్యారు. ఈయ‌న న‌టించిన తొలి పాన్ ఇండియా ఫిల్మ్ `ద‌స‌రా` విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. శ్రీకాంత్ ఓదెల ఈ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టించింది.

మార్చి 30న ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో భారీ ఎత్తున విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సాంగ్స్‌ సినిమాపై భారీ అంచ‌నాలు క్రియేట్ చేశాయి. ప్ర‌మోష‌న్స్ తో మ‌రింత హైప్ పెర‌గ‌డంతో.. ద‌స‌రాకు క‌ళ్లు చెదిరే రీతిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. కేవ‌లం నైజాం ప్రాంతంలోనే ఈ సినిమా థియేట్రిక‌ల్ హ‌క్కులు ఏకంగా 14 కోట్ల రూపాయలకి అమ్ముడుపోయాయి.

ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా టోట‌ల్ బిజినెస్ ఏకంగా రూ. 50 కోట్ల మార్క్ ను అందుకుంది. నాని కెరీర్ లోనే హ‌య్య‌స్ట్ బిజినెస్ చేసిన చిత్రం ద‌స‌రా రికార్డు సృష్టించింది. ఇక ఏరియాల వారీగా ద‌స‌రా టోట‌ల్ బిజినెస్ లెక్క‌ల‌ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 13.7 కోట్లు
సీడెడ్: 6.5 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 3.9 కోట్లు
తూర్పు: 2.35 కోట్లు
పశ్చిమ: 2 కోట్లు
గుంటూరు: 3 కోట్లు
కృష్ణ: 2Cr
నెల్లూరు: 1.2 కోట్లు
———————————-
ఏపీ+తెలంగాణ‌= 34.65 కోట్లు
———————————-

కర్ణాటక: 2.85 కోట్లు
ఇతర భాషలు: 1.5 కోట్లు
నార్త్ ఇండియా: 5 కోట్లు
ఓవర్సీస్: 6 కోట్లు
—————————–
మొత్తం బిజినెస్‌= 50 కోట్లు
—————————–

కాగా, ప్రపంచ‌వ్యాప్తంగా ద‌స‌రాకు సినిమాకు రూ. 50 కోట్ల రేంజ్ లో బిజినెస్ జ‌రిగింది. అంతే నాని హిట్ కొట్టాలంటే బాక్సాఫీస్ వ‌ద్ద మినిమమ్ రూ. 51 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాల్సి ఉంటుంది.