ధ‌నుష్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. అప్పుడే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `సార్‌`!?

తమిళ స్టార్ హీరో ధనుష్, మ‌ల‌యాళ ముద్దుగుమ్మ సంయుక్త మీన‌న్ జంట‌గా న‌టించిన చిత్రం `సార్‌`. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ధ‌నుష్ తెలుగులో తొలిసారి నేరుగా చేసిన చిత్రమిది.

ఇందులో సాయికుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని, తనికెళ్లభరణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఫిబ్ర‌వ‌రి 17న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం.. తొలి ఆట నుంచే హిట్ టాక్ ను అందుకుంది. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే వ‌సూళ్ల‌ను రాబ‌డుతూ దుమ్ము దులిపేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ధ‌నుష్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యే గుడ్‌న్యూస్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అదేంటంటే.. సార్ సినిమా ఓటీటీలోకి వ‌చ్చేయ‌బోతోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ సొంతం చేసుకుంది. మార్చి 22 నుంచి ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ భాషల్లోనూ స్ట్రీమింగ్‌ చేయాలని నెట్‌ఫ్లిక్స్ సంస్థతో సార్‌ మూవీ మేకర్స్‌ డీల్‌ కుదిరించుకున్నట్లు సమాచారం‌. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంద‌ని అంటున్నారు.

Share post:

Latest