సినీ ప్రపంచంలో ఎవరైనా నెగ్గుకు రావాలి అంటే చాలా కష్టపడాల్సిందే .. ముఖ్యంగా అందం అభినయం ఉన్నప్పటికీ ఎక్కడో ఒకచోట పలు సందర్భాలలో ఇబ్బందులు పడ్డవారు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్లు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ప్రతి ఒక్కరు కూడా క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొనే ఉంటారు. అయితే కొంతమంది ఈ విషయాన్ని బయట పెడుతూ ఉంటారు మరి కొంతమంది చెప్పడానికి ఇష్టపడరు.
ఈ మధ్యకాలంలో కాస్త హీరోయిన్స్ కూడా ధైర్యం తెచ్చుకొని సోషల్ మీడియా వేదికగా తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి తెలియజేయడం జరుగుతూ వస్తోంది. తాజాగా ఒక తమిళ నటి తనకు జరిగిన ఒక చేదు అనుభవం గురించి తెలియజేయడం జరిగింది. కడైకుట్టి సింగం అనే సీరియల్స్ ద్వారా మంచి పేరు సంపాదించుకున్న నటి జీవిత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి దానివల్ల పోయిన ఆఫర్ల గురించి తెలియజేయడం జరిగింది..
నటి జీవిత మాట్లాడుతూ నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఒక దర్శకుడు వద్దకు ఆడిషన్ కు వెళ్లగా ఆయన హీరోయిన్గా నీకు ఆఫర్ ఇస్తాను.. అంతేకాకుండా అత్యధిక రెమ్యూనరేషన్ ఇస్తాను వరుస అవకాశాలు కూడా ఇస్తానని చెప్పారట.అయితే వాటికోసం కొద్దిగా సర్దుకుపోవాలని చెప్పారట.. డైరెక్టర్, కెమెరా మ్యాన్, నిర్మాత, మేనేజర్లతో సర్దుకుపోవాలని ఎప్పుడు పిలిస్తే అప్పుడు రూమ్ కి రావాలని చెప్పారట. అప్పుడే తాను మొదటిసారి డైరెక్టర్ తో మాట్లాడడం జరిగిందని ఆయన చెప్పిన మాటలకు ఏం చేయాలో తెలియక ఏడ్చేసానని చాలా అవమానంగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి బయటికి వచ్చానని మరొకసారి ఆ డైరెక్టర్ వద్దకు అసలు వెళ్లలేదని చెప్పుకొచ్చింది జీవిత .ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.