ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు..వైసీపీ స్కెచ్.!

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు సైతం హోరాహోరీగా సాగుతున్న విషయం తెలిసిందే. మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో గెలవడానికి అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టి‌డి‌పి గట్టిగానే పోరాడుతున్నాయి. మధ్యలో బి‌జే‌పి సైతం రేసులో ఉంది. ఇక ఎమ్మెల్సీ స్థానాల్లో పట్టు ఉండే కమ్యూనిస్టులు కూడా పోటీపడుతున్నారు. కమ్యూనిస్టుల అనుబంధ సంఘంగా ఉన్న పి‌డి‌ఎఫ్ సైతం గట్టి పోటీ ఇస్తుంది.

దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. అయితే సాధారణ ఎన్నికల ముందు జరుగుతున్నాయి కాబట్టి..వీటిపై ప్రధాన పార్టీలు గట్టిగా ఫోకస్ చేశాయి. ముఖ్యంగా పట్టభద్రుల స్థానాలని గెలుచుకోవాలని గట్టిగా ట్రై చేస్తున్నాయి. తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానాల్లో సత్తా చాటాలని చూస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో కూడా గెలవడానికి వైసీపీ పూర్తిగా అధికార బలాన్ని ఉపయోగిస్తుంది. అలాగే బోగస్ ఓట్లు కూడా నమోదు చేయించుకుని గెలవాలని చూస్తుందని విమర్శలు వస్తున్నాయి.

మూడు పట్టభద్రుల నియోజకవర్గాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేల సంఖ్యలో బోగస్‌ ఓట్లు నమోదు చేశారని చంద్రబాబు మండిపడుతున్నారు. అధికార పార్టీ ఆగడాలను అడ్డుకోవాలని కోరారు. జగన్‌ దొంగ ఓట్లతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం గెలవాలని ప్రయత్నిస్తున్నాడని,  టీడీపీ తరఫున ఇదే హెచ్చరిస్తున్నా.. జైలుకు వెళ్లడానికి సిద్ధపడితేనే దొంగ ఓటు వేయడానికి ప్రయత్నించండని, మిమ్మల్ని వదిలే ప్రశ్నేలేదని అచ్చెన్నాయుడు వార్నింగ్ ఇచ్చారు.

అయితే టి‌డి‌పి కేవలం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లోనే పోటీ చేస్తుంది.. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్య ర్థి చిరంజీవిరావు, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి పోటీ చేస్తున్నారు.