చిరంజీవికి ఘోర అవ‌మానం.. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది పాపం!

మెగాస్టార్ చిరంజీవికి ఘోర అవమానం జరిగింది. ఈ ఏడాదిని చిరంజీవి `వాల్తేరు వీరయ్య` హిట్ తో ఘ‌నంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వ‌సూళ్ల‌ను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

రీసెంట్గా అత్యధిక సెంటర్స్ లో 50 రోజుల‌ను కూడా పూర్తి చేసుకుంది. అయితే తాజాగా ఈ మూవీని ఓటీటీ లో స్ట్రీమింగ్ చేశారు. థియేటర్స్ లో హిట్ అయినట్టుగానే ఓటీటీలో కూడా ఈ సినిమాకు అద్భుత‌మైన‌ రెస్పాన్స్ వస్తుందని అనుకున్నారు. కానీ ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. ప్రముఖ ఓటీటీ దిగ్గ‌జం నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 27న ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయ‌గా.. ఆశించిన స్థాయిలో వ్యూస్‌ను రాబ‌ట్ట‌లేకపోయింది. మరో ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఏంటంటే.. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ లిస్టులో రావడానికి ఏకంగా రెండు రోజుల సమయాన్ని తీసుకుంది.

ఇది ఒక రకంగా చిరంజీవికి ఘోర అవమానం అనే చెప్పాలి. వాల్తేరు వీరయ్యకు పోటీగా వచ్చిన `వీర సింహారెడ్డి` సినిమా థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే ఓటీటీలో కూడా ప్రభంజనం సృష్టించింది. ఓటీటీలోకి దిగిన ఒక్క నిమిషంలోనే ఏకంగా 150కే వ్యూస్‌ సాధించి సంచలన‌ రికార్డును సృష్టించింది. అలాగే కొన్ని గంటల్లోనే టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. కానీ వాల్తేరు వీర‌య్య విషయంలో అలా జరగకపోవడంతో మెగా ఫ్యాన్స్ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.