ఎట్టకేలకు రవితేజను మోసం చేశానని ఒప్పుకున్న బంగ్లా గణేష్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా నిర్మాతగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు నటుడు బండ్ల గణేష్. ఎప్పుడు కూడా ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతూనే ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు వీర అభిమానిగా పేరుపొందారు. ఆమధ్య పొలిటికల్ పైన కూడా ట్రై చేశారు కానీ అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. నిత్యం పలు రకాలుగా ట్వీట్లు చేస్తూ వైరల్ గా మారుతూ ఉంటారు బండ్ల గణేష్. ముఖ్యంగా తను ఎవరి మీదైనా చెప్పాలనుకునే విషయాన్ని డైరెక్ట్ గా చెబుతూ కాకరేపుతూ ఉంటారు. అయితే గతంలో కావాలనే రవితేజను మోసం చేసినట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది.వాటి గురించి తెలుసుకుందాం.

బండ్ల గణేష్ మాట్లాడుతూ రవితేజకు నేను పొలం అమ్మాను.. అతడు ఎంతో ఇష్టపడి ఆ స్థలాన్ని కొనుక్కున్నారు. పొలం కింద నాకు ఇంకో 30 ఎకరాలు ల్యాండ్ ఉంది. అంతా కలిసి ఒక బిట్టుగా అమ్మితే కొంటానని ఒక వ్యక్తి నాతో అన్నాడు.. మంచి లాభం వచ్చే టైం అది ఇప్పుడు రవితేజ దగ్గరకి వెళ్లి నిజం చెప్పకుండా అబద్ధం చెపుతా ఆ ప్రాంతంలో ప్రభుత్వం భూసేకరణ చేస్తోంది అమ్మడం బెటర్ అని చెబుతూ దీంతో ఆ ల్యాండ్ సేల్ చేస్తారని తన ఉద్దేశంగా అలా చెప్పానని తెలిపారు.

దీంతో ఆ ల్యాండ్ అమ్మడం జరిగింది రవితేజ. ఆ రోజు నేను చాలా బాధపడ్డ అతనితో సినిమా చేస్తే నాకు రూ .5 కోట్లు మిగిలాయి అయినా అలాంటి వ్యక్తిని మోసం చేసినందుకు ఇప్పటికీ ఫీల్ అవుతూనే ఉన్నాను కానీ ఏదో ఒక రోజు అతని రుణం తీర్చుకుంటాను తర్వాత నిన్ను మోసం చేశా అన్న అని రవితేజతో చెప్పే నాకు తెలుసురా అని వదిలేశానని చెప్పాడట రవితేజ. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.

Share post:

Latest