సమంత పోస్ట్ పై అనుష్క శర్మ స్పందన ఇదే!

తెలుగు సినిమా పరిశ్రమను ఒకసారి పరిశీలిస్తే నేటి నటీమణులలో అందంతో పాటు మంచి టాలెంట్ ఉన్న నటిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సమంత ఒకరు. ఇక ఆమె గురించి ప్రత్యేకంగా తెలుగు జనాలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి సినిమా “ఏం మాయ చేసావే” మూవీతోనే తెలుగు సినిమా ప్రేక్షల మనసులను కొల్లగొట్టింది సామ్. అంతేకాకుండా ఆ సినిమాలో హీరోగా నటించిన నాగ చైతన్య మనసుని కూడా మాయ చేసి ఆఖరికి అతగాడికి ఇల్లాలు అయిపోయింది. తరువాత కొన్నాళ్ళకు ఏమైందో గాని సరిగ్గా సంవత్సరం క్రితం వారు వారి వివాహ జీవితానికి వీడ్కోలు పలికారు.

ఆ తరువాత సామ్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు, కానీ మునుపటికంటే ఆమె మంచిగా సినిమా అవకాశాలను అందుకుంటూ కెరీర్లో దూసుకుపోతోంది. ఇక అంతబాగుందనే సరికి ఆమెని అనారోగ్యం వెంటాడుతోంది. ఈ విషయంలో ఆమెకి తన అభిమానులు ఎంతగానో మద్దతు తెలుపుతున్నారు. ఇప్పుడిప్పుడే ఆమె ఆ బాధలనుండి కోలుకుంటోంది. ఇప్పటికీ సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న సమంత సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అనేక విషయాలను తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుందనే విషయం తెలిసినదే.

 

అందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా సమంత ఒక పోస్ట్ చేయగా దానికి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ స్పందించడం ఇపుడు హాట్ టాపిక్ అయింది. “కొన్నిటిని ఎదుర్కోవడానికి ఒక్కోసారి మన బలం సరిపోదు. అపుడు కేవలం మనపై మనకున్న నమ్మకం మాత్రమే ముందుకు నడిపిస్తుంది. అదే మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. ఆ నమ్మకమే స్నేహితుడిగా మారుతుంది. అది మనల్ని మానవాతీత శక్తిగా నిలబెడుతుంది” అని సమంత రాసుకొచ్చింది. దానికి అనుష్క శర్మ “నేను దీనిని పూర్తిగా అంగీకరిస్తున్నాను” అంటూ ఓ హార్ట్‌ ఎమోజీని షేర్ చేయడం విశేషం.

Share post:

Latest