అన‌సూయ మామూల్ది కాదు.. ఒక్క‌ రోజుకు అంత డిమాండ్ చేస్తుందా?

బుల్లెతరపై స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో అనసూయ ఒకటి. అయితే గ‌త కొద్ది రోజుల నుంచి అనసూయ బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. అందుకు కారణం చేతి నిండా ఉన్న సినిమాలే. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెండితెర‌పై అనసూయ దూసుకుపోతోంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ న‌టిస్తోంది.

`పుష్ప` సినిమాతో ఈమె క్రేజ్‌ మరింత పెరిగింది. ఇందులో దాక్షాయని పాత్రలో మంగళం శీను భార్యగా అద్భుతమైన నటనను క‌న‌బ‌రిచి అద‌ర‌గొట్టేసింది. ఈ మూవీ తర్వాత వెండితెర‌పై వరుస ప్రాజెక్టులతో అనసూయ ఫుల్ బిజీ గా మారింది. ఈ క్రమంలోనే త‌న రెమ్యున‌రేష‌న్ ను కూడా భారీగా పెంచేసింద‌ని తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఒకప్పుడు ఒక రోజుకు లక్ష నుంచి లక్షన్నర రెమ్యునరేషన్ తీసుకున్న అన‌సూయ‌.. ఇప్పుడు ఏకంగా మూడు లక్షలు డిమాండ్ చేస్తుంద‌ట‌. ఏదేమైనా ఒక్క రోజుకే మూడు లక్షలు అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. అయినా సరే ఆమెకు ఉన్న డిమాండ్‌, క్రేజ్‌ దృష్ట్యా అనసూయ అడిగినంత మొత్తం నిర్మాతలు ఇస్తున్నారని ఇన్‌సైడ్ టాక్‌.

Share post:

Latest