`అర్జున్ రెడ్డి` డైరెక్ట‌ర్ తో బ‌న్నీ నెక్స్ట్‌.. రెమ్యున‌రేష‌న్ తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!?

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప 2` సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇకపోతే బన్నీ త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ ను `అర్జున్ రెడ్డి` మూవీతో సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ సెన్సేష‌న్ సృష్టించిన సందీప్ రెడ్డి వంగా తో ప్ర‌క‌టించాడు.

 

శుక్రవారం ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో బాలీవుడ్ అగ్ర‌ నిర్మాణ సంస్థ టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. భూషణ్ కుమార్‌, ప్రణయ్ వంగా ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. బన్నీ కెరీర్లో తెర‌కెక్క‌బోయే 23వ సినిమా ఇది. పుష్ప 2 పూర్తయిన వెంటనే ఈ సినిమా సెట్స్‌ మీదకి వెళ్ల‌నుంది.

 

అయితే ఈ సినిమాకు బ‌న్నీ అందుకుంటున్న రెమ్యున‌రేష‌న్ తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు. ఎందుకంటే, `పుష్ప 2` కు వంద కోట్ల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్న బ‌న్నీ.. సందీర్ రెడ్డితో చేయ‌బోయే సినిమాకు ఏకంగా రూ. 135 కోట్లు డిమాండ్ చేశాడ‌ట‌. పుష్ప ది రైజ్ తో బ‌న్నీ మార్కెట్ భారీగా పెరిగింది. పైగా పుష్ప 2పై ఎన్నో అంచ‌నాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ అంత మొత్తం ఇచ్చేందుకు ఒకే చెప్పార‌ని టాక్ న‌డుస్తోంది. దీంతో ఇప్పుడీ విష‌యం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

Share post:

Latest