సిద్ధార్థ్‌తో ల‌వ్ ఎఫైర్‌.. షాకింగ్ రిప్లై ఇచ్చిన అదితి రావు హైదరీ!

ప్ర‌ముఖ హీరో సిద్ధార్థ్‌, హీరోయిన్ అదితి రావు హైదరీ పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలుతున్నారంటూ గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రూ తొలిసారి `మ‌హాస‌ముద్రం` సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఈ సినిమా స‌మ‌యంలో ఏర్ప‌డ్డ ప‌రిచ‌య‌మే ప్రేమ‌గా మారింద‌ని.. ప్ర‌స్తుతం సిద్ధార్థ్‌, అదితి డేటింగ్ చేస్తున్నార‌ని విస్తృంతంగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇద్ద‌రు ప‌లు మార్లు జంట‌గా మీడియాకు చిక్క‌డం, ఇటీవ‌ల జ‌రిగిన శ‌ర్వానంద్ ఎంగేజ్మెంట్ కు కలిసి రావ‌డం ఆ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. దీనికితోడు తాజాగా ఇద్దరు కలిసి ఓ తమిళ పాటకి రీల్ చేశారు. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది అదితి రావు హైదరీ. దీంతో సిద్ధార్థ్‌తో అదితి ల‌వ్ ఎఫైర్ నిజ‌మే అని చాలా మంది న‌మ్ముతున్నారు. అయితే తాజాగా ఈ వార్త‌ల‌పై అదితి స్పందిస్తూ షాకింగ్ రిప్లై ఇచ్చింది. ఈ భామ న‌టించిన ‘తాజ్: డివైడెడ్ బై బ్లడ్’ అనే వెబ్ సిరీస్‌ ‘జీ-5’ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఈ క్ర‌మంలోనే సిద్ధార్థ్‌తో ల‌వ్ ఎఫైర్ గురించి మాట్లాడింది. `ఇటువంటి రూమర్స్‌కు నేను ప్రాధాన్యమివ్వను. నేను పలు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాను. ప్రజలు ఎల్లప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. అందరి నోళ్లను మనం మూయించలేం. ప్రస్తుతం నాకు ఇష్టమైన డైరెక్టర్స్‌తో నేను పనిచేస్తున్నాను. ప‌లు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్నా. ప్రజలు నన్ను నటిగా అంగీకరించినంత వరకు నటిస్తూనే ఉంటాను. పర్సనల్‌ విషయాలు కాదు, సినిమా కెరీర్‌పై దృష్టి పెట్టండి` అంటూ ఘాటుగా అదితి రిప్లై ఇచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి. అయితే అదితి సిద్ధార్థ్‌తో ప్రేమ‌లో లేన‌ని నేరుగా చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Share post:

Latest