వావ్‌: శ్రీదేవి కెరీర్‌లో ఈ ఫొటో ఎంత స్పెష‌ల్ అంటే…!

ఈరోజు అతిలోకసుందరి శ్రీదేవి వర్ధంతి సందర్భంగా ఆమె భర్త బోని కపూర్ ఓ అరుదైన ఫోటోను సోషల్ మీడియాతో పంచుకున్నాడు. ఆ ఫోటో కూడా ఆయన లైఫ్‌లో ఎంతో అరుదైన మెమరీ అట. అతిలోకసుందరి శ్రీదేవి తొలిసారిగా బోనీ కపూర్ 1984లో ఓ సినిమా షూటింగ్లో ఆమెతో దిగిన ఆ ఫోటోను నేడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. శ్రీదేవి లేని లోటు తాను ఇప్పటికే ఫీల్ అవుతున్నాను అంటూ బోనీ కపూర్  చెప్పాడు.

Sridevi fifth death anniversary: Boney Kapoor shares the last ever picture of actress and his beloved wife

ఇక బోనీ ఎప్పటికప్పుడు ఆమెతో ఉన్న తన మధుర క్షణాలను… ఆ తీపి కాలాన్ని గుర్తు చేసుకుంటూ.. మొదటిసారిగా శ్రీదేవితో దిగిన ఆ ఫోటో బ‌య‌ట పెట్టాడు. 2018 ఫిబ్రవరిలో ఓ పెళ్లి కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి 54 ఏళ్ల వయసులోనే అక్కడే బాత్ రూమ్ టబ్‌లో పడి మరణించింది. ఆమె మరణించిన విషయాన్ని గుర్తు చేసుకున్న బోని, శ్రీదేవి తనను వదిలి వెళ్లి ఐదేళ్లు అయినా ఆమె జ్ఞాపకాలు తన ముందు అలానే ఉన్నాయని చెప్పుకొచ్చారు.

Wedding Photos of Sridevi & Boney Kapoor | OLD is GOLD - YouTube

1996లో శ్రీదేవి – బోనీ పెళ్లి చేసుకున్నారు. ఆ మరుసటి ఏడాది జాన్వి కపూర్ పుట్టింది. ఖుషీ కపూర్ 2000లో జన్మించింది. పిల్లలు పుట్టిన తర్వాత పూర్తిగా వెండితెరకు దూరమైన‌ శ్రీదేవి. ఆ తర్వాత కొన్నాళ్లకు రీఎంట్రీతో ఇచ్చింది. శ్రీదేవి.. ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ పేరిట ఈ ఏడాదిలోనే ఆమె జీవిత చరిత్రపై పుస్తకం రాబోతోంది. ఈ పుస్తకం ప్రచురణ హక్కులను వెస్ట్ ల్యాండ్ బుక్స్ కొనుగోలు చేసింది. శ్రీదేవి ఫ్యామిలీ ఫ్రెండ్ ధీరజ్ కుమార్ ఈ పుస్తకాన్ని రచిస్తున్నారు.

Share post:

Latest