మరోసారి మహేష్ కొంప ముంచనున్న త్రివిక్రమ్..??

హారిక-హాసిని బ్యానర్‌పై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. ఎంతో మంది ఆర్టిస్టులతో రూపొందుతున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో తండ్రి కొడుకు పాత్రలో నటించిన మహేష్, ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో తాత మనవడు పాత్రలో కనిపించబోతున్నారు. మొదటిసారి ప్రకాష్ రాజ్, మహేష్ కి తాతగా నటిస్తున్నారు. అలానే జగపతి బాబు ఈ సినిమా లో విలన్ పాత్రలో కనిపించబోతున్నారు.

గతంలో త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన అల వైకుంఠపురములో, అత్తారింటికి దారేది, అతడు లాంటి సినిమాలలో తాత అనే పాత్ర చాలా కీలకమైనది. అలానే ఈ సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ నటిస్తున్న తాత పాత్రను డిజైన్ చేసారు. అయితే ఆ క్యారెక్టర్ కామెడీ యాంగిల్ లో ఉంటుందా లేక సీరియస్ యాంగిల్ లో ఉంటుందా అనేది చూడాలి.

కాగా చాలా మంది త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన తాత మనవడు సినిమాలో ఏ సినిమా హిట్ అయింది అని పరిశీలిస్తున్నారు. ఎందుకు అంటే ఆ హిట్ అయిన సినిమాలోని పాత్రలకు అనుగుణంగా కొత్త సినిమాలు త్రివిక్రమ్ రూపొందిస్తున్నారు. అయితే ఇలా త్రివిక్రమ్ ప్రయోగాలు చేస్తూ ఉంటే అది బెడ్స్ కొడితే మళ్ళీ మహేష్ కి ఖలేజా లాంటి డిజాస్టర్ వస్తుంది. అందుకే త్రివిక్రమ్ మళ్ళీ మహేష్ కొంపముంచుతాడా అని చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ ను ముంచుతాడో లేక తెలుస్తాడో చూడాలిక.

Share post:

Latest