రామ్ పెళ్లికి దూరంగా ఉండ‌టానికి ఆమెతో బ్రేక‌ప్పే కార‌ణ‌మా..?

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒకడు. ఈయన వయసు 34. అయినా సరే పెళ్లి ఊసే ఎత్తడం లేదు. చిన్న వయసులోనే టాలీవుడ్లోకి అడుగుపెట్టిన రామ్.. తనదైన టాలెంట్ తో తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. అలాగే చాక్లెట్ బాయ్ గా యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ముఖ్యంగా అమ్మాయిల్లో రామ్ కు ఫాలోయింగ్ చాలా ఎక్కువ.

ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత మాస్‌ హీరోగా అవతరించిన రామ్.. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన 20వ చిత్రాన్ని చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే రామ్ ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతాడా అని ఆయన అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. కానీ ఆ గుడ్ న్యూస్ మాత్రం చెప్పడం లేదు.

అయితే రామ్ పెళ్లికి దూరంగా ఉండటానికి గతంలో జరిగిన ఓ బ్రేక‌ప్పే కారణమని ఇన్సైడ్ టాక్‌ నడుస్తోంది. గతంలో రామ్ ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడట. ఆ అమ్మాయి కూడా రామ్ ను ఎంతో ప్రేమించిందట. కానీ పలు కారణాల వల్ల వీరిద్దరూ విడిపోవాల్సి వచ్చిందట. ఆ తర్వాత సదరు అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందట. ఇక ఈ బ్రేకప్ కారణంగానే రామ్ కు పెళ్లి పై ఆసక్తి తగ్గిపోయిందని.. దాంతో ఇంట్లో వారు ఎన్ని సంబంధాలు చూసినా నో చెబుతున్నాడని ప్ర‌చారం జ‌రుగుతోంది. మరి ఈ ప్రచార ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

Share post:

Latest