నాని `ద‌స‌రా`తో సిల్క్ స్మితకు ఉన్న సంబంధం ఏంటి..?

న్యాచుర‌ల్ నాని, జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ద‌స‌రా`. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. సంతోష్ నారాయణన్ స్వ‌రాలు అందిస్తున్నాడు. తెలంగాణలోని సింగరేణి నేపథ్యంలో సాగే రా అండ్‌ రస్టిక్‌ ఫిల్మ్ ఇది.

ఇందులో నాని మున్నెప్పుడూ క‌నిపించ‌నంత ఊర‌మాస్ లుక్ లో అల‌రించ‌బోతున్నాడు. మార్చి 30న ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ఈ చిత్రం అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌, సాంగ్స్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశారు. ఇక‌పోతే ఈ సినిమా పోస‌ర్స్ లో ప్ర‌ముఖ న‌టి సిల్క్ స్మిత ఫోటోను బాగా ఎలివేట్ చేస్తున్నారు. అస‌లు `ద‌స‌రా`తో సిల్క్ స్మితకు ఉన్న సంబంధం ఏంటి..? అన్న‌ది చాలా మందిలో ఉన్న ప్ర‌శ్న‌.

 

అయితే అందుతున్న స‌మ‌చారం ప్ర‌కారం.. ఈ సినిమా మొత్తం సిల్క్ స్మిత చుట్టూ తిరుగుతుందట. ఆమె పేరిట ఒక బార్ ఉంటుందట. నానితో పాటు మరో గ్యాంగ్‌ కూడా రెగ్యూలర్‌గా ఆ బార్ కు వచ్చిపోతుంటారట. అయితే ఈ రెండు గ్రూపులకు మధ్య గొడవ జరుగుతుందని, దీనికి కారణంగా అంతా రెండుగా విడిపోయి కొట్టుకుంటుంటారని, మరి ఆ గొడవేంటి? ఎందుకు గొడవ పడ్డారు, అందులో స్కిల్ స్మిత్‌ హోటల్‌ పాత్ర ఏంటి? నాని ఏం చేశాడనేది కథగా ఉండబోతుందని తెలుస్తుంది. సింగరేణి ప్రాంతం లో జరిగే గొడవలు, అక్కడి జనం పాటించే ఆచారాలు, పద్ధతులు వంటివి వెండితెర మీద అద్దం పట్టేలా డైరెక్టర్ శ్రీకాంత్ ఓడేలా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాడ‌ని స‌మాచారం. మ‌రి భారీ అంచ‌నాల‌ను ఉన్న ఈ సినిమా నానికి ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుందో చూడాలి.

Share post:

Latest