శ్రీదేవి మరణానికి ముందు ఏం జరిగింది.. బోనీ కపూర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!

అప్పటివరకు ఓ వెలుగు వెలిగిన నటీమణులు అర్థాంత‌రంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిన ఘటనలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. అటువంటి ఘటనలో ఇండియన్ స్టార్ హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవి మరణం కూడా ఒకటి.. దుబాయిలో వారి బంధువుల ఓ పెళ్లి ఫంక్షన్‌కు వెళ్లిన ఈమె 2018 ఫిబ్రవరి 24న బాత్రూమ్ టబ్‌లో పడి మరణించింది.

In Pics: 12 Must Watch Films of Sridevi

కోట్లాదిమంది తన అభిమానులకు, తన కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయింది.రేపు అతిలోకసుందరి శ్రీదేవి వర్ధంతి సందర్భంగా భర్త బోనికపూర్ ఆమె చనిపోవటానికి ఒకరోజు ముందు ఆమెతో దిగిన ఓ ఇంట్రెస్టింగ్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటోలలో శ్రీదేవి తన ఫ్యామిలీతో ఎంతో అందంగా రెడీ అయి తన కుటుంబంతో కలిసి ఫోటోల‌కి ఫోజులు ఇచ్చింది.

ఆ ఫోటోల‌లో శ్రీదేవిని చూస్తుంటే అచ్చం దేవకన్యలా కనిపిస్తుంది. ఇక తన మొహంపై కల్మషం లేని చిరునవ్వు ఆమె పెద్దాలపై అలాగే నిలిచి ఉంది. ఆ ఫోటో చూసిన నెటిజన్లు శ్రీదేవికి మరణం లేదు ఆమె ఎప్పుడూ మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ ఆమెపై తమ ప్రేమను వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం బోనీకపూర్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Boney.kapoor (@boney.kapoor)

Share post:

Latest