బాలీవుడ్ సెలబ్రిటీస్ అయిన కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఈ నెల 7వ తేదీన పెళ్లితో ఒక్కటైన సంగతి విధితమే. చాలా రోజులుగా ప్రేమించుకుంటున్న ఈ జంట చివరికి పెళ్లితో ఒక్కటైంది. రాజస్థాన్ లోని జైసల్మీర్ సూర్యఘడ్ ప్యాలెస్ లో అత్యంత గ్రాండ్ గా ఈ పెళ్లి జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు.
ఈ పెళ్లి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది. తాజాగా ఇప్పుడు పెళ్లి మెహందీ సంగీత్ ఇలా ఈవెంట్ ఫోటోలను ఈ జంట తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఆ సంగీత్ వేడుకలో సిద్ధార్థ్- కీయారా కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఆరోజు రాత్రి గురించి ఏం చెప్పాలి.. సంథింగ్.. సంథింగ్.. రియల్లీ.. స్పెషల్ అంటూ కామెంట్ చేశారు.
ఇక ఈ సందర్భంలోని కియారా అవుట్ ఫిట్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆ ఫోటోలో కియారా కంప్లీట్ గోల్డెన్ సిల్వర్ రంగులో ఉన్న లెహంగాను ధరించింది. ఆ లెహంగాను 98 వేలకు పైగా క్రిస్టల్స్ తో ఎంతో ప్రత్యేకంగా ఆమె కోసం డిజైన్ చేశారట.లెహంగాను సుమారు 4000 గంటలు (దాదాపు 24 వారాలు) కష్టపడి ఆ లెహంగాను డిజైన్ చేస్తారట మనీష్ మల్హోత్రా. ప్రస్తుతం కీర వేసుకున్న ఆలెహంగా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.