`రానా నాయుడు` కోసం బాబాయ్‌, అబ్బాయి గ‌ట్టిగానే లాగేశార‌ట‌?!

దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. బాబాయ్, అబ్బాయి కలిసి `రానా నాయుడు` అనే వెబ్ సిరీస్ లో నటించారు. పాపులర్ అమెరికన్ సిరీస్ `రే డోనోవర్` స్ఫూర్తితో మన నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి ఈ వెబ్ సీరిస్ రూపొందించారు. సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ ఈ సీరిస్‌కు దర్శకత్వం వహించారు.

ఇందులో వెంక‌టేస్‌, రానా తండ్రీకొడుకులుగా క‌నిపించ‌బోతున్నారు. ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ మార్చి 10 నుంచి తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవ‌ల బ‌య‌ట‌కు వ‌చ్చిన `రానా నాయుడు` ట్రైల‌ర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది.

ఇదిలా ఉంటే.. ఈ వెబ్ సిరీస్ కోసం బాబాయ్‌, అబ్బాయి గ‌ట్టిగానే రెమ్యున‌రేష‌న్ ను లాగేశార‌ట‌. సినిమాల‌కు మించి వెంకీ, రానా ఈ వెబ్ సిరీస్ కు ఛార్జ్ చేశారట‌. అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. వెంకటేష్ ఏకంగా రూ. 10 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటే.. రానా రూ. 8 కోట్ల రెమ్యునరేషన్ ని పుచ్చుకున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Share post:

Latest