త్రివిక్రమ్ హీరోయిన్‌కి ఆ మాత్రం ఉండాలి… పూజా కోసం ఏం చేశారో చూడండి…!

టాలీవుడ్ స్టార్ దర్శక‌డు త్రివిక్రమ్ కు కలిసి వచ్చిన హీరోయిన్లలో సమంత కూడా ఒకరు.. త్రివిక్రమ్ ఈమెతో చేసిన దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాలుగా నిలిచాయి. ఆ తర్వాత అంతగా నచ్చిన మరో హీరోయిన్ పొడుగు కాళ్ల సుందరి పూజ హెగ్డే.. ఈమెతో కూడా త్రివిక్రమ్ తీసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచాయి.

The two factors that made Trivikram to cast Pooja for Allu Arjun's film |  123telugu.com

ఇప్పుడు వరుసగా మూడోసారి ఆమెను మహేష్ బాబు సినిమా కోసం హీరోయిన్‌గా తీసుకున్నాడు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్‌తో చేయబోయే సినిమాలో కూడా పూజా అనే హీరోయిన్‌గా నటించబోతుందని టాక్ కూడా ఉంది. ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతం త్రివిక్రమ్, మహేష్ తో చేస్తున్న సినిమా షూటింగ్లో త్వరలో అడుగుపెట్టబోతుంది పూజా.

ఈ సినిమా షూటింగ్ ఓ షెడ్యూల్ ముగించుకొని.. త్వరలోనే మరో ఓ భారీ షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. ఈ షెడ్యూల్ నుంచే పూజా జాయిన్ కాబోతోంది. పూజా షూటింగ్ కోసం ఏకంగా ఈ సినిమా యూనిట్ ఏ హీరోయిన్ కు చేయని భారీ ఘనకార్యం చేయబోతుంది. పూజా ఈ సినిమా షూటింగ్‌ కోసం ఆమెకు ఓ కొత్త లగ్జరీ కారును కొన్ని ఇవ్వనున్నారట. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు పూజా హెగ్డే ప్రత్యేకంగా వాడుకోవటం కోసం ఆ కారును బహుమతిగా ఇస్తున్నారట.

Pooja Hegde Gifts Herself BMW Car With Hard Earned Money

త్రివిక్రమ్ కి ఎంతో ఇష్టమైన హీరోయిన్ కాబట్టే ఆమెకు ఈ రేంజ్ లో ఫెసిలిటీ ఇస్తున్నార‌న్న గుస‌గుస‌లూ వ‌స్తున్నాయి. సాధారణంగా హీరోల కోసం ఇలాంటి ఏర్పాట్లు చేస్తుంటారు. కానీ పూజా కు వున్న ప్రయారిటీ అలాంటిదిఅన్నమాట.ఎలాగూ ఓ కారు అద్దెకు తీసుకుని అరేంజ్ చేయాలి. దానికి అయినా ఖర్చు అవుతుంది. దానికి బదులు కొత్తది కొని ఇస్తే ప్రయారిటీ ఇచ్చినట్లుంటుంది. సినిమా ఖర్చులో కలుస్తుంది. దాంతో పూజా ఫుల్ ఖుషీ..!

Share post:

Latest