సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ మృతి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో గడచిన సంవత్సరం నుంచి ఎక్కువగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక గడచిన కొద్ది రోజుల క్రితం అలనాటి హీరోయిన్ జమున పలు అనారోగ్య సమస్యతో మరణించింది. ఇప్పుడు తాజాగా సీనియర్ డైరెక్టర్ సాగర్ మరణించాలనే వార్త అటు అభిమానులలో సెలబ్రిటీలలో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాలా చేస్తోంది .గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఈయన ట్రీట్మెంట్ తీసుకుంటూ కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. పోయిన ఏడాది వరుసగా సినీ తారలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

Veteran Telugu Film director Sagar (70) passes away! | Telugu Movie News -  Times of India
జమున మరణ వార్త మరువకముందే ఇప్పుడు మరొక సీనియర్ డైరెక్టర్ సాగర్ మరణించారని తెలుస్తోంది సాగర్ తన ఇంట్లో ఈరోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని తన కుమారుడు వెల్లడించారు. గత కొంతకాలంగా ఈ డైరెక్టర్ లివర్ సమస్యతో బాధపడుతున్నారట. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ సినిమాలను తెరకెక్కించారు. ఈయన దాదాపుగా 30 సినిమాల వరకు తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అలనాటి హీరోలలో కృష్ణ ,సుమన్, భానుచందర్, సాయికుమార్ వంటి హీరోలతో పలు బ్లాక్ బస్టర్ విజయాలను కూడా తెరకెక్కించారు డైరెక్టర్ సాగర్.

అలా డైరెక్టర్ గా ఉంటున్న సమయంలోనే ఈయన కింద కొంతమంది డైరెక్టర్లు పని చేశారట. అలాంటి వారిలో డైరెక్టర్ శ్రీనువైట్ల, వివి వినాయక్ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈయన అసలు పేరు విద్యాసాగర్ రెడ్డి. ఇక డైరెక్టర్ సాగర్ దర్శకత్వం వహించిన రామ సక్కనోడు అనే చిత్రానికి మూడు నంది అవార్డులను కూడా గెలుచుకున్నారట. తెలుగు ఫిలిం అసోసియేషన్కు కూడా మూడుసార్లు అధ్యక్షుడిగా పనిచేసినట్లు తెలుస్తోంది ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.