టాలీవుడ్‌కు కొత్త తరాన్ని పరిచయం చేస్తానంటున్న దర్శకేంద్రుడు.. మెగాస్టార్ ఏం చేశాడంటే..

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అంటే ఆయన సినిమాలలోని రొమాంటిక్ సాంగ్స్ గుర్తుకు వస్తాయి. హీరోయిన్ల బొడ్డుపై పండ్లు, పూలు విసిరే సీన్లు అంటే అవి ఖచ్చితంగా రాఘవేంద్రరావు సినిమాలలో ఉంటాయని అంతా చెప్పేస్తారు. ఇలాంటి రొమాంటిక్ సినిమాలతో పాటు భక్తిపరమైన చిత్రాలకు ఆయన పెట్టింది పేరు. శ్రీరామదాసు, పాండురంగడు, శిరిడీ సాయి, అన్నమయ్య వంటి ఎన్నో భక్తిరస చిత్రాలను తీసి, ప్రేక్షకులను అలరించారు. ఇక టాలీవుడ్‌కు కొత్త కొత్త హీరోలను, హీరోయిన్లను పరిచయం చేసింది ఆయనే. ఇటీవల ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు చిత్ర సీమకు మరింత మంది కొత్త కొత్త నటీనటులను పరిచయం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. దీనికి సంబంధించిన కీలక విషయాలిలా ఉన్నాయి.

కేఆర్ఆర్ వర్క్స్ అనే పేరుతో కొత్త యూట్యూబ్ ఛానల్‌ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రారంభించారు. దీనిని మెగాస్టార్ చిరంజీవి లాంఛనంగా ప్రారంభించారు. దీని ద్వారా సినిమాకు సంబంధించి 24 క్రాఫ్ట్స్ వారికి అవకాశాలు కల్పిస్తారు. ఇప్పటికే షార్ట్ ఫిలిమ్స్ తీయడం మొదలైంది. తద్వారా ఎంతో అనుభవం ఉన్న రాఘవేంద్ర రావు దర్శకత్వంలో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన నటులకు మంచి భవిష్యత్తు ఉంటోంది. సినిమా పట్ల అభిరుచి ఉన్న ఔత్సాహిక నటీనటులు, సాంకేతిక నిపుణులకు రాఘవేంద్రరావు ఊతం ఇవ్వనున్నారు.

ఇక ఆయనకు చిరంజీవితో ఎంతో సాన్నిహిత్యం ఉంది. వీరి కలయికలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అదే కాకుండా ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు వంటి సినిమాలు కూడా వీరి కాంబినేషన్‌లో వచ్చాయి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రయత్నాన్ని చిరంజీవి అభినందించారు.

Share post:

Latest