ఎన్టీఆర్ సినిమా ఎఫెక్ట్‌.. ఆ డైరెక్ట‌ర్‌తో చీవాట్లు తిన్న జ‌య‌సుధ‌…!

తెలుగు చిత్ర పరిశ్రమలో లెజెండ్రి దర్శకులుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కళాతపస్వి కే విశ్వనాథ్ గారు గత కొద్ది రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. ఈ లెజెండ్రీ దర్శకుడు మరణించడం చిత్ర పరిశ్రమకు ఎంతో తీరని లోటు అని చెప్పాలి. విశ్వనాథ్ గారి డైరెక్షన్‌లో ఎన్నో ఆణిముత్యాలు లాంటి సినిమాలు ప్రేక్షకుల‌ ముందుకు వచ్చి వారి మ‌న‌సులో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అయితే తాజాగా ఇప్పుడు ఆయన గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఓ స్టార్ హీరోయిన్ చేసిన పనికి దాదాపు చాలా రోజులు ఆ హీరోయిన్ తో మాట్లాడలేదట విశ్వనాథ్.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం. విశ్వనాథ్ గారు తన కెరీర్ లో దాదాపు 50 సినిమాలుకు పైగా దర్శకత్వం వహించారు. అంతేకాకుండా ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి ఒక్క సినిమా ప్రేక్షకులకు ఏదో ఒక కొత్త అనుభూతిని ఏదో ఒక విషయాన్ని అందరికీ కళ్ళకు కట్టేలా చూపించేవారు. ఆయన దర్శకత్వంలో సాగర సంగమం, స్వాతిముత్యం, శంకరాభరణం, స్వయంకృషి వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి.

అయితే ఆయన తెరకెక్కించిన సాగర సంగమం సినిమాకి హీరోయిన్‌గా ముందుగా జయప్రదను కాకుండా జయసుధను అనుకున్నారట. ఆమెకు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించడానికి అడ్వాన్స్ కూడా ఇచ్చారట. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తున్నాడంతో సినిమా షూటింగ్ ఎప్పుడు మొద‌ల‌వుతందో తెలియని జయసుధ వేరే సినిమాలు కమిట్ అయింది. ఇక తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలైన సమయంలో సీనియర్ ఎన్టీఆర్ కు జంటగా ఓ సినిమాలో నటించే అవకాశం రావడంతో సాగర సంగమం సినిమా ఛాన్స్ ను వదులుకుందట.

ఇలా ఈ సినిమాలో నటించే అవకాశం కోల్పోవడంతో ఈ సినిమాకు జ‌య‌సుధ తీసుకున్నా అడ్వాన్స్ తిరిగి వెనక్కి ఇచ్చేసిందిట‌. ఇలా అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయడంతో విశ్వనాథ్ గారు తనపై కోప్పడ్డారని చాలా రోజులు తనతో మాట్లాడలేదని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో విశ్వనాథ్ గారితో ఉన్న తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. ఆ త‌ర్వాత‌ చాలా రోజులకీ ఓసారి నేను విశ్వనాథ్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు నాతో నటిస్తావా?’ అని అడిగారు. అదే ఆయనతో తన చివరి మాటలు అని జయసుధ ఈ సందర్భంగా గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.

Share post:

Latest