ఉత్తరాంధ్ర టీడీపీలో ‘ఎమ్మెల్సీ’ చిచ్చు..షాక్ తప్పదా!

ఇప్పుడుప్పుడే తెలుగుదేశం పార్ట్ గాడిలో పడుతుందనుకుంటే..ఆ పార్టీలో కొన్ని అంతర్గత విభేదాలు ఇబ్బందిగా మారుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల పార్టీలో అంతర్గత విభేదాలు నడుస్తున్నాయి. వాటిని నిదానంగా పరిష్కరించుకుంటూ చంద్రబాబు ముందుకెళుతున్నారు. కానీ కొన్ని చోట్ల రచ్చ తగ్గట్లేదు. ఇదే సమయంలో టి‌డి‌పి బలపడుతున్న ఉత్తరాంధ్రలోల్ ఊహించని ట్విస్ట్ వచ్చింది. పట్టబధ్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నిక టి‌డి‌పిలో చిచ్చు రేపింది.

ఉత్తరాంధ్ర పట్టబధ్రుల స్థానానికి ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ స్థానంలో పోటీ చేయడానికి టి‌డి‌పి సీనియర్ నేత  ఈర్లె శ్రీరామ మూర్తి చూస్తున్నారు. అది కూడా రెబల్ గా బరిలో దిగడానికి సిద్ధమయ్యారు. వాస్తవానికి మొదట చంద్రబాబు..రామమూర్తిని అభ్యర్దిగా ప్రకటించాలని చూసారట. కానీ తర్వాత ఓ బీసీ లేడీ మహిళని అభ్యర్ధిగా తెరపైకి తీసుకొచ్చారు. చివరి నిమిషంలో ఆమెని మార్చి ఉపాధ్యాయుడుని ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దింపుతున్నారు. దీనిపై రామమూర్తి ఫైర్ అవుతున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలందిస్తున్నా.. తనను చూసి ఓర్వలేక మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏ పదవీ రానీయడం లేదని శ్రీరామమూర్తి ఆరోపించారు. అందుకే ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి రెబల్ గా పోటీ చేస్తానని ప్రకటించారు.

గతంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌, ఆర్‌టీఐ కమిషనర్‌గా పదవులిచ్చే సమయంలోనూ అయ్యన్నపాత్రుడు అడ్డు తగిలారని ఆరోపించారు. చివరకు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కూడా అడ్డుకున్నారని అన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్న చిన్ని కుమారి లక్ష్మిని మార్చేసి.. చిరంజీవి రావును టి‌డి‌పి రంగంలోకి దించింది. ఇలా మార్పులకు కారణం అయ్యన్నపాత్రుడు అని రామమూర్తి ఫైర్ అవుతున్నారు. అందుకే రెబల్ గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మరి ఈయన పోటీ టి‌డి‌పికి నష్టం చేకూర్చే అవకాశం ఉందనే చెప్పాలి.