క్రూరమైన విలన్‌గా తార‌క‌ర‌త్న‌… ఈ రోల్ స్పెషాలిటీ ఇదే..!

నందమూరి తారకరత్న 23 రోజుల నుంచి మృత్యువుతో పోరాడి గత రాత్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. నందమూరి తారకరత్న చనిపోయాడనే విషయం తెలియగానే ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా తీవ్ర దుఃఖానికి గురవుతున్నారు. అతి చిన్న వయసులోనే తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడని చాలామంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆయన భార్యాపిల్లలకు ఆయన చనిపోవడం పెద్ద విషాదం.

ఇక తారకరత్న తన సినీ కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించారు. ఆయన హీరోగా కన్నా విలన్ గానే ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే సినీ నటుడు రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అమరావతి సినిమాలో తారకరత్న విలన్ గా శ్రీను అనే క్యారెక్టర్ లో నటించారు. ఎంతో క్రూరమైన ఈ పాత్రలో తారకరత్న ఎంతో అద్భుతంగా నటించారు.

అప్ప‌టి వ‌ర‌కు హీరోగా న‌టించినా రాని పేరు ఈ సినిమాతో తార‌క‌ర‌త్న‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో ఆయన నటనకు గాను ఏకంగా ఉత్తమ నంది అవార్డు కూడా అందుకున్నారు. ఈ సినిమానే కాకుండా మరో రెండు సినిమాల్లో కూడా తారకరత్న విల‌న్‌గా నటించాడు. ఇక తాజాగా 9 అవ‌ర్స్‌నే వేబ్ సీరిస్ లో కూడా తార‌క‌ర‌త్న విల‌న్‌గా న‌టించాడు.

ఇప్పుడు మ‌ళ్ళీ సినిమాలు బీజి అవుతున్న స‌మ‌యంలో ఇలా మ‌ర‌ణించ‌డంతో ఒక్క‌సారిగా అంద‌రిని తీవ్ర దుఃఖానికి గురిచేసింది. ఇక అయ‌న చివ‌రిగా సార‌ధి. మిస్ట‌ర్ తార‌క్ సినిమాలో న‌టించారు. అందులో మిస్ట‌ర్ తార‌క్ త‌ర్వాలో ప్రేక్ష‌కుల ముందు రావ‌డానికి సిద్ధంగా ఉంది. ఇదే తార‌క‌ర‌త్న చివ‌రి సినిమా.

Share post:

Latest