ఈ స్టార్ హీరోయిన్ల కాస్ట్‌లీ విడాకులు… వీరి భరణం చూస్తే గుండె గుబేలే…!

చిత్ర ప‌రిశ్ర‌మాలో ప్రేమ‌లు, పెళ్లిళ్లు, బ్రేక‌ప్‌లు, విడాకులు చాల‌ కామ‌న్‌. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఉన్నా స్టార్లు కూడా వారి వైవాహిక జీవితంలో ఆనందంగా గడపాలని కోరుకుంటారు. ఇక వారి కారణం ఏదైనా సినిమా స్టార్ల వైవాహిక బంధాలు ఎంతో సున్నితంగా ఉంటాయి. వారిలో వ‌చ్చే చిన్న చిన్న విషయాలకే పంతాలకు పట్టింపుల‌కు పోయి విడాకులు తీసుకుంటూ ఉంటారు. సమంత – నాగచైతన్య విడాకులు తీసుకునే నాలుగు నెలల ముందు వరకు కూడా గోవాలో పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేశారు.

వారు ఒకరుంటే ఒకరికి ఎంతో ప్రేమ అని చాటుకున్నారు. ఆ స‌మ‌యంతో అసలు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇద్ద‌రి హంగామానే కనిపించేది. అంతగా ఎంజాయ్ చేసిన జంట కేవ‌లం 4 నెలల తర్వాత విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అయితే విడాకుల సమయంలో చాల‌మంది స్టార్ హీరోలు త‌మ‌ భార్యలకు భారీ భరణం కూడా సమర్పించుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన విడాకులు ఎవరివో ఇప్పుడు చూద్దాం.

సైఫ్ ఆలీఖాన్ – అమృతాసింగ్ :
అస‌లు వీరి వివాహం ఎంతోపెద్ద సంచ‌ల‌నం. వ‌య‌స్సులో త‌న‌క‌న్నా 12 ఏళ్లు పెద్ద‌ది అయిన అమృత‌ను సైఫ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చాలా యేళ్లు ఈ జంట ఎంతో ఆనందంగా కాపురం చేసింది. వీరి కుమార్తె సోహా ఆలీఖాన్ ఇప్పుడు బాలీవుడ్‌ యంగ్ క్రేజీ హీరోయిన్‌. ఆ త‌ర్వాత‌ క‌రీనా క‌పూర్‌ను పెళ్లాడేందుకు సైఫ్ అమృత‌కు విడాకులు ఇచ్చాడు. అయితే విడాకుల త‌ర్వాత‌ అప్ప‌టి వ‌ర‌కు అత‌డు సంపాదించిన దాంట్లో స‌గం మొత్తం ఆమెకు భ‌ర‌ణంగా ఇచ్చాడు. ఇది కొన్ని కోట్ల‌లో ఉంది.

హృతిక్ రోష‌న్ – సుసానే ఖాన్ :
హృతిక్ త‌న చిన్న‌నాటి స్నేహితురాలైన‌ సుసానేను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వీరి ఇద్ద‌రికి పిల్ల‌లు పుట్టాక 2014లో వీరు విడాకులు తీసుకున్నారు. అస‌మ‌యంంలో సుసానే రు. 400 కోట్లకు పైగా భ‌ర‌ణం డిమాండ్ చేయ‌గా.. అందులో స‌గం ఇచ్చేందుకు హృతిక్ ఒప్పుకున్నాడ‌న్న ప్ర‌చారం జ‌రిగింది.

మ‌లైకా అరోరా – అర్బాజ్ ఖాన్‌:
15 ఏళ్ల పాటు కాపురం చేసి ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నించిన‌ ఈ జంట విడాకులు తీసుకుంది. వీరి విడాకుల‌కు మ‌లైకా- అర్జున్‌క‌పూర్‌తో ప్రేమ‌లో ఉండ‌డ‌మే కార‌ణం. అయితే మ‌లైక భ‌ర‌ణం కోర‌క‌పోయ‌నా కూడా అర్బాజ్ ఆమెకు రు . 20 కోట్లు భ‌ర‌ణం చెల్లించాడ‌ట‌.

సంజ‌య్ క‌పూర్ – క‌రిష్మా క‌పూర్ :
అభిషేక్ బ‌చ్చ‌న్‌తో ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌కుండానే విడిపోయింది క‌రిష్మా క‌పూర్‌. ఆ త‌ర్వాత అమెరికా ఎన్నారై సంజ‌య్‌క‌పూర్‌ను పెళ్లాడి 14 ఏళ్లు కాపురం చేసి.. ఇద్ద‌రు బిడ్డ‌ల త‌ల్లి అయ్యాక విడాకులు ఇచ్చేసింది. క‌రిష్మా భ‌ర‌ణంగా ముంబైలో ఖ‌రీదైన ఓ ఇంటితో పాటు నెలా నెలా రు. 10 ల‌క్ష‌ల వ‌డ్డీ వ‌చ్చే ఆస్తులు, త‌న పిల్ల‌ల పేరిట రు. 14 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు రాయించుకుంది.

నాగ‌చైత‌న్య – స‌మంత :
ఇటీవ‌ల టాలీవుడ్‌లో విడిపోయిన జంట చైతు, స‌మంత‌. విడాకుల త‌ర్వాత అక్కినేని కుటుంబం.. స‌మంత‌కు రు. 200 కోట్ల భ‌ర‌ణం ఇచ్చింద‌న్న ప్ర‌చారం జ‌రిగింది. అయితే స‌మంత వీటిని ఖండించింది.