`సార్‌` టోట‌ల్ బిజినెస్ ఇదే.. హిట్ కొట్టాలంటే ధ‌నుష్ ఎంత ర‌బ‌ట్టాలి..?

తమిళ స్టార్ హీరో ధనుష్, సంయుక్త హీన‌న్ జంట‌గా వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `సార్‌(త‌మిళంలో వాతి)`. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మించారు. సాయికుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని, తనికెళ్లభరణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ధ‌నుష్ తెలుగులో నేరుగా చేసిన తొలి చిత్ర‌మిది.

నేడు తెలుగు, త‌మిళ భాష‌ల్లో అట్ట‌హాసంగా విడుద‌ల అయిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది. విద్య అనేది మ‌న ప్రాథ‌మిక హ‌క్కు. అంద‌రికి అందుబాటులో ఉండాల్సిన విద్యా నేడు ఎలా వ్యాపారంగా మారిపోయింది? అధిక ఫీజుల కార‌ణంగా దిగువ‌, మ‌ధ్య త‌ర‌గ‌తి పిల్ల‌లు చ‌దువుకు ఏ విధంగా దూర‌మ‌వుతోన్నార‌నే పాయింట్‌తో సార్ సినిమాను తెర‌కెక్కించారు సినిమాలో ట్విస్టులు, ట‌ర్నులు ఉండ‌క‌పోయినా.. మంచి మెసేజ్ ఇచ్చార‌ని అంటున్నారు.

ఇక‌పోతే ఈ మూవీ టోట‌ల్ బిజినెస్ భారీగా జ‌రిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 5.50 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సినిమా తెలుగు లో హిట్ అవ్వాలి అంటే ఆల్ మోస్ట్ 6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. మ‌రోవైపు త‌మిళంలో రూ. 19.00 కోట్లకు ఈ సినిమా థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను కొనుగోలు చేశారు. అలాగే క‌ర్ణాట‌క లో రూ. 3 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవ‌ర్సీస్ లో రూ. 6 కోట్ల రేంజ్ లో బిజినెస్ జ‌రిగింది. ఇక వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ మూవీ టోట‌ల్ బిజినెస్ రూ. 35 కోట్లు. అంటే హిట్ కొట్టాలంటే ధ‌నుస్ మొత్తం రూ. 36 కోట్లు రాబ‌ట్టాల్సి ఉంటుంది.

Share post:

Latest