అంద‌రికి షాక్ ఇస్తూ తన రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సమంత..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో తన క్రేజ్ పెంచుకుంది. ఆ తర్వాత తన మొదటి సినిమా హీరో నాగచైతన్యను ప్రేమించి అక్కినేని ఇంటి కోడలు అయింది. ఇక పెళ్లయిన నాలుగు సంవత్సరాలకే వారి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు.

రీసెంట్‌గా య‌శోద‌తో హిట్ కొట్టి త్వ‌ర‌లోనే మరో పాన్ ఇండియా సినిమా శాకుంతలంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న దగ్గర నుంచి సమంత రెండో పెళ్లి పై సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంది. అంతేకాకుండా ఈ విషయాల దగ్గర నుంచి తన ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక చింతనతో వరుస దేవాలయాలను దర్శించుకుంటూ సద్గురు స్వామి దగ్గరికి వెళ్లినా కూడా ఈమె రెండో పెళ్లి చేసుకున్నారని గతంలో ఎన్నో వార్త‌లు కూడా వినిపించాయి.

అలాగే సమంత అమ్మా, నాన్న కూడా ఒక అబ్బాయిని చూశారని, ఇక ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారంటూ కూడా ఎన్నో వార్తలు వచ్చాయి. ఇటీవ‌ల‌ సమంత ముంబైలో ఓ ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఇక దీంతో సమంత పూర్తిగా టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పి ఇక బాలీవుడ్ లోనే తన కెరీర్ కొనసాగిస్తుంది అంటూ అంతేకాకుండా అక్కడ ఉన్న ఓ బిజినెస్‌మాన్‌ను సమంత పెళ్లి చేసుకుంటుందని వార్తలు కూడా వినిపించాయి.

BREAKING : తన ఆరోగ్యం గురించి సమంత ప్రత్యేక పూజలు | Manalokam

ఈ వార్త‌ల నేప‌థ్యంలో స‌మంత రెండో పెళ్లిపై సిగ్న‌ల్స్ ఇస్తోంది. రీసెంట్‌గా ఆమె పళని మురుగన్ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించుకుంది. అక్కడ ఈమె ఆ గుడికి ఉన్న ప్రతి మెట్టుకు పూజ చేసుకుంటూ హారతి కర్పూరం వెలిగించుకుంటూ అక్కడ ఉన్న 600 మెట్లు ఎక్కింది. ఇప్పుడు ఈ విషయం గమనిస్తే కనుక ఇప్పట్లో సమంత‌ రెండో పెళ్లి చేసుకునె ఆలోచన లేదని తెలుస్తుంది. తన ఫోకస్ మొత్తం తన కెరీర్ మీదే అని క్లారిటీ ఇస్తున్న‌ట్టుగా ఉంది.

Share post:

Latest