పవన్‌కు రోజా సపోర్ట్..టీడీపీ అంత పనిచేస్తుందా?

ఎప్పుడైతే టి‌డి‌పి-జనసేన పొత్తు పెట్టుకుంటాయని ప్రచారం మొదలైందో అప్పటినుంచే వైసీపీ..పొత్తుని ఎలాగైనా దెబ్బతీయాలనే విధంగా రాజకీయం నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఆ రెండు పార్టీలు పొత్తు ఉంటే వైసీపీకి పెద్ద రిస్క్. గత ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది.

దాదాపు 50 సీట్లలో ఓట్లు చీలిక వైసీపీకి కలిసొచ్చింది. కానీ ఈ సారి ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన పొత్తు పెట్టుకుంటే ఆ సీట్లలో వైసీపీకి షాక్ తప్పదు. అదే జరిగితే వైసీపీకి అధికారంలోకి రావడం అనేది కష్టమవుతుంది. అందుకే పొత్తు లేకుండా చేయాలని చెప్పి..వైసీపీ నానా రకాలుగా టి‌డి‌పి-జనసేనల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా నందమూరి-మెగా ఫ్యాన్స్ మధ్య గొడవలు పెట్టడం, కమ్మ-కాపు వర్గాల మధ్య చిచ్చు పెట్టడం లాంటివి చేస్తుంది. దీంతో వైసీపీ ట్రాప్ లో నిదానంగా టి‌డి‌పి—జనసేన శ్రేణులు పడుతున్నట్లే కనిపిస్తున్నాయి.

ఇదే సమయంలో అసలు పవన్ కల్యాణ్ పై ఎప్పుడు విరుచుకుపడే మంత్రి రోజా..తాజాగా సానుభూతి చూపించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లోకేశ్ పాదయాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే. దానిపై కామెంట్ చేస్తూ… టీడీపీ చంద్రబాబుది కాదని..ఎన్టీఆర్ పార్టీ అని,  పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప ఇక పార్టీ బతికేది లేదని చంద్రబాబు-లోకేష్‌కు అర్దం అయిందన్నారు.

అయితే లోకేష్ పాదయాత్ర ఫెయిల్ అయిందని, దీంతో వారాహితో పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వస్తే ఎక్కడ హీరో అవుతాడనే భయంతో పవన్ కళ్యాణ్‌ పై టి‌డి‌పి శ్రేణులు విషం చిమ్ముతున్నారని రోజా కామెంట్ చేశారు. అసలు వారాహి బస్సుని అడ్డుకుంటానికి చూస్తుంది వైసీపీ..పవన్‌ని ఇష్టారాజ్యంగా తిట్టేది వైసీపీ. కానీ టి‌డి‌పి ఏదో చేస్తుందని కల్పించి చెప్పి..టి‌డి‌పి-జనసేనల మధ్య చిచ్చు పెట్టి..లబ్ది పొందాలనేది వైసీపీ కాన్సెప్ట్ గా ఉంది. అందులో భాగంగానే రోజా..పవన్‌కు సపోర్ట్ చేస్తూ మాట్లాడటం అని చెప్పవచ్చు.

Share post:

Latest