వారిపై ఒక రేంజ్‌లో ఫైర్ అయిన రామ్ చరణ్ హీరోయిన్..

 

చాలా మంది అభిమానులకు, సినిమా జర్నలిస్టులకు వారి హీరో లేదా హీరోయిన్ల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. అయితే అలా తెలుసుకోవడానికి చేసే ప్రయత్నంలో పరిమితులు దాటడం వల్ల ఎంతో మంది సెలబ్రిటీలను ఇబ్బందులో పడేస్తున్నారు. ఇటీవలే బాలీవుడ్ నటి అలియా భట్ కి కూడా ఇలాంటి చేదు సంఘటన ఒకటి ఎదురయింది. ఇక ఈ సంఘటన పై ఫొటోగ్రాఫర్స్, మీడియా సిబ్బందిపై అలియా విరుచుకు పడింది.

బాలీవుడ్ నటి అలియా భట్ తన ఇంట్లో ఉన్న లీవింగ్ రూమ్ లో పని చేస్తున్నపుడు ఎదురుగా ఉన్న ఒక బిల్డింగ్ టెర్రస్ నుండి కొంతమంది ఆమెని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇక ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో విషయం తెలుసుకున్న అలియా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసారు. అలియా భట్ లానే ఎంతో మంది సెలెబ్రిటీలు అభిమానులు చేసే పనులకు ఇబ్బందులు పడి “మేం కూడా మీలాంటి మనుషులమే కదా మాకంటూ పర్సనల్ లైఫ్ ఉంటుంది దానిని ఎందుకు బహిరంగం చేస్తున్నారు” అని మండిపడ్డ సందర్బాలు చాలా ఉన్నాయి.

అలియా పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవ్వడంతో ఆమె ఫోటోగ్రాఫర్లు, మీడియా వారిపై విరుచుకుపడుతూ ” నేను నా ఇంట్లో లీవింగ్ రూమ్ లో పని చేసుకుంటున్నపుడు కొంతమంది ఎదురుగా ఉన్న బిల్డింగ్ టెర్రస్ పై కెమెరాలు నా వైపుకి పెట్టడం గమనించాను. నా పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఫోటోలు తీసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? ఫోటోగ్రాఫర్స్ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు ” అంటూ సోషల్ మీడియాలో మండిపడింది. అలియా పోస్ట్‌కి చాలామంది తోటి నటీనటులు సపోర్టు పలికారు.

 

Share post:

Latest