హాలీవుడ్ సినిమాల‌పై చ‌ర‌ణ్ మోజు.. అతి పెద్ద‌ కోరిక బ‌య‌ట‌పెట్టిన‌ మెగా ప‌వ‌ర్ స్టార్‌!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌కు ఆయన ప్రజెంటర్‌గా వ్యవహరించనున్నాడు. హెచ్‌.సి.ఎ. సంస్థ ఆయన్ని ఆహ్వానించింది. ఈ నేపథ్యంలోనే అమెరికా వెళ్లిన రామ్ చ‌ర‌ణ్ కు మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. అమెరికాలో అత్యధిక మంది వీక్షించే పాపులర్ షోలలో ఒకటైన `గుడ్ మార్నింగ్ అమెరికా`లో పాల్గొనే అవ‌కాశాన్ని చ‌ర‌ణ్ ద‌క్కించుకున్నారు.

అలాగే వచ్చే నెల ఆస్కార్ అవార్డుల కార్యక్రమం జ‌ర‌గ‌బోతోంది. ఈ నేప‌థ్యంలోనే అమెరికాలో వ‌రుస ఇంట‌ర్వ్యూల్లో పాల్గొంటూ రామ్ చ‌ర‌ణ్ `ఆర్ఆర్ఆర్‌`ను అక్క‌డ గ‌ట్టిగా ప్ర‌మోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే హాలీవుడ్ మీడియా `ఏబీసీ` న్యూస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చ‌ర‌ణ్‌ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

భ‌విష్య‌త్తు ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ.. మ‌న మ‌న‌సులో ఉన్న అతి పెద్ద కోరిక‌ను బ‌య‌ట‌పెట్టేశాడు. `ఆర్ఆర్ఆర్‌` తో మీకు గ్లోబల్ స్టార్ గా మారిన మీరు హాలీవుడ్ చిత్రాలు చేయాలనుకుంటున్నారా? అని ప్ర‌శ్నించగా.. ` నేను ఆల్రెడీ కొన్ని ఇండియన్ ప్రాజెక్ట్స్ ఒప్పుకొని ఉన్నాను. అయితే హాలీవుడ్ మేకర్స్ తో పని చేయాలనే కోరిక ఉంది. నేను ఇష్టపడే అనేక మంది డైరెక్టర్స్ హాలీవుడ్ లో ఉన్నారు. భవిష్యత్ లో హాలీవుడ్ చిత్రాలు చేసే అవకాశం వస్తుందేమో చూడాలి. నేనైతే సిద్ధంగా ఉన్నాను` అంటూ చ‌ర‌ణ్ స‌మాధానం ఇచ్చాడు. మొత్తానికి త‌న‌కు హాలీవుడ్ సినిమాలపై మోజు ఉంద‌ని ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పేశాడు.

Share post:

Latest