టీడీపీలోకి రాజేష్ మహాసేన..జనసేన ఫైర్!

మహాసేన పేరుతో అంబేద్కర్ ఆశయాలని ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేస్తున్నామని రాజేష్ మహాసేన ఎప్పటికప్పుడు అధికార వైసీపీపై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన రాజేష్..వైసీపీ అధికారంలోకి వచ్చాక..ఆ పార్టీ తప్పు చేస్తుందని చెప్పి..వైసీపీకి దూరం జరిగారు. అలాగే వైసీపీ అధికారంలో దళితులపై దాడులు పెరిగాయని, ఎక్కడకక్కడ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు.

అలా ప్రశ్నిస్తూ సోషల్ మీడియా రాజేష్ మహాసేన బాగానే ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలైన టి‌డి‌పి, జనసేనలకు మద్ధతు తెలుపుతూ ముందుకొస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మధ్య ఆయన జనసేన వైపు వెళ్ళిన విషయం తెలిసిందే. అధికారికంగా ఆ పార్టీలో చేరలేదు గాని..జై మహాసేన, జై జనసేన అంటూ…పవన్ ఫోటో పెట్టుకుని ముందుకెళుతున్నారు. అదే సమయంలో ఆయన్ని జనసేన పార్టీలో మీటింగులకు పిలవడం లేదనే అంశం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే రాజేష్‌కు తెలుగుదేశం పార్టీ నేతలు టచ్ లోకి వచ్చారు. దీంతో ఆయన టి‌డి‌పి వైపుకు వెళ్ళేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో చంద్రబాబు..తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.

అప్పుడు చంద్రబాబు సమక్షంలో రాజేష్ మహాసేన టి‌డి‌పిలో చేరనున్నారు. ఈ విషయాన్ని తాజాగా రాజేష్ స్పష్టం చేశారు. తాజాగా రాజేష్‌..యనమల రామకృష్ణుడు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి..పలువురు టి‌డి‌పి నేతలని కలిశారు. దీంతో ఆయన టి‌డి‌పిలో చేరడం లాంఛనమైంది. అయితే జనసేనకు సపోర్ట్ ఇచ్చి..ఇప్పుడు టి‌డి‌పిలో చేరడానికి రెడీ అవ్వడంపై జనసేన శ్రేణులు ఫైర్ అవుతున్నాయి.

రాజేష్ మహసేన టీడీపీ లోకి వెళ్ళాలి అని డెసిషన్ తీసుకున్నారని,  అదే జనసేనకి కూడా మంచిదని,  కరెక్టుగా 3 నెలలు కూడా ఉండలేక పోయారని,  ఏదో రెండు మీటింగ్స్‌కి పిలవలేదని మీరు వెళ్లిపోతున్నారని,  అంటే మీరు జనసేనకి కరెక్టుకాదని జనసేన శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. అయితే రాజేష్ ఏ పార్టీలోకి వెళ్లాలనేది అతని నిర్ణయమని, అతనిపై ఎలాంటి విమర్శలు చేయవద్దని నాగబాబు..జనసేన శ్రేణులకు సూచించారు.