చిరంజీవి పై ఫైర్ అయిన రాజమౌళి.. కారణం..?

ప్రస్తుతం రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. శాంతినివాసం అనే ఎపిసోడ్ సీరియల్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టిన రాజమౌళి.. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా మొదటి హిట్ అందుకున్నాడు.. ఆ తర్వాత తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా మగధీర, బాహుబలి, ఈగ, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు జక్కన్నకు ప్రపంచ స్థాయి అభిమానులను సంపాదించి పెట్టాయి. రాజమౌళి తన తదుపరి సినిమాను మహేష్ బాబుతో తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా పెరిగాయి. ఇదిలా ఉండగా రాజమౌళి గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.

అసలు విషయంలోకి వెళ్తే.. రాజమౌళి చిరంజీవి తనయుడు రామ్ చరణ్ హీరోగా మగధీర సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో జక్కన్న ఇండస్ట్రీ రికార్డులను బీట్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. అయితే ఈ సినిమా తర్వాత మెగా ఫ్యాన్స్ సపోర్ట్ తోనే ఇంత పెద్ద హిట్ అయిందని.. హీరో వల్లే సినిమా ఈ రేంజ్ లో విజయం సాధించిందని ప్రచారం కూడా జరిగింది. దాంతో ఎంతో కష్టపడిన రాజమౌళి చిరంజీవి పై ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ఈ విషయం తనకు తెలియకుండా జరిగిందని జక్కన్నకు చిరంజీవి చెప్పడంతో ఆయన కూల్ అయినట్టు సమాచారం.

ఈ విషయం కాస్త అప్పట్లో చాలా సంచలనంగా మారింది. మొత్తానికైతే ఈ వివాదంపై చిరంజీవి క్లారిటీ ఇచ్చి వార్తలకు పులిస్టాప్ పెట్టారు . ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన భోళా శంకర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమాను విడుదలకు ఉంచబోతున్నట్లు తెలుస్తోంది.

Share post:

Latest