సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్ తో ఏడ‌డుగులు వేసిని శివాత్మిక.. వైర‌ల్ గా మారిన పిక్‌!

సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ జీవిత దంపతుల కుమార్తె శివాత్మిక రాజశేఖర్.. ప్రముఖ స్టార్ సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్ తో ఏడడుగులు వేసింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట‌ తెగ చక్కర్లు కొడుతోంది. ఈ పిక్ ను చూసిన నెటిజ‌న్లు రాహుల్‌ సిప్లిగంజ్ శివాత్మిక పెళ్లి చేసుకుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

కానీ నిజానికి వీరిది రియ‌ల్ పెళ్లి కాదు.. రీల్ పెళ్లి. అవును, టాలీవుడ్ క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం `రంగమార్తాండ`. ఇందులో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, లెజెండరీ కమెడియన్‌ బ్రహ్మానందం, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్‌, అనసూయ భరద్వాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

చాలా కాలంగా సెట్స్‌ పై ఉన్న ఈ చిత్రం.. 2023లో థియేట‌ర్స్ లోకి రాబోతోంది. అయితే ఈ సినిమా నుంచి ఓ పిక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందులో పెళ్లి కూతురుగా శివాత్మిక క‌నిపించ‌గా.. ప‌క్క‌నే పెళ్లి కొడుకుగా రాహుల్‌ సిప్లిగంజ్‌ ఉన్నాడు. అలాగే ఈ పిక్ లో శివాత్మిక త‌ల్లి దండ్రులుగా ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ క‌నిపిస్తున్నారు. బ్రహ్మానందం, అన‌సూయ స‌హా మ‌రికొంద‌రు కూడా ఈ పిక్ లో క‌నిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ పిక్ నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. నెటిజ‌న్లు రాహుల్‌, శివాత్మిక‌ల‌ను మీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారా, చేసుకోండి మీ జంట బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.