తొందరపడి తప్పు చేస్తున్న ప్రభాస్.. ఫ్యాన్స్ డిసప్పాయింట్‌మెంట్??

ప్రముఖ నటుడు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమా తో పాన్ ఇండియా లెవల్ లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆ సినిమా తరువాత చెత్త సినిమాలతో అభిమానులను నిరాశపరుస్తున్నాడు. సాహో, రాధే శ్యామ్ సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయ్యాయి. ఈ క్రమంలోనే డార్లింగ్ ప్రభాస్ నటించిన సినిమాలు ఆరు నెలల వ్యవధిలో ఒకదాని తరువాత ఒకటి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఈ ఏడాది జులై 16న ఆదిపురుష్ సినిమా విడుదల కానుంది. సెప్టెంబర్ 28న సలార్, వచ్చే ఏడాది జనవరి 12న ప్రాజెక్ట్ k విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ హీరో నుండి అతి తక్కువ సమయంలో ఏకంగా మూడు సినిమా లు రావడం అనేది చాలా అరుదు. పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ గా ఎదగాడిని, ప్రతి ఒక్క సినిమా హిట్ అవకడానికి ప్రభాస్ కి ఇది పెద్ద అవకాశం.

అయితే మూడు సినిమాలు తక్కువ సమయం గ్యాప్ లో విడుదల అవడం వల్ల ఒకదాని ప్రభావం ఇంకో సినిమా పై పడే అవకాశం కూడా ఉంది. ఈ మూడు సినిమాలో ఏది ప్లాప్ అయిన దాని ప్రభావం మాత్రం కచ్చితంగా ఇంకో సినిమాపై చూపిస్తుంది. ఈ విషయం పై ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అలాగే మూడు సినిమాల ప్రమోషన్లను ఒకేసారి చేయడం కాస్త కష్టమే. మొత్తం మీద తొందరపడి ప్రభాస్ తప్పు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Share post:

Latest