ఎన్టీఆర్ కోసం వ‌స్తున్న ప్ర‌భాస్‌.. ఇక ఫ్యాన్స్ కు పూన‌కాలే!?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని చాలా కాలం క్రితమే అనౌన్స్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం మరి కొద్ది రోజుల్లో సెట్స్‌ మీదకు వెళ్ల‌బోతోంది. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితం కానున్న ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ కు పరిచయం కాబోతోంది. ఈనెల 24న ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛ్‌ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.

కానీ ఇంతలోనే నందమూరి తారకరత్న మృతి చెందారు. దీంతో లాంఛింగ్ ఈవెంట్ ను వచ్చేనెలకు పోస్ట్ పోన్ చేశారు. మార్చి మొదటి వారంలో లేదా రెండో వారంలో `ఎన్టీఆర్ 30` లాంఛింగ్ ఈవెంట్ జరగబోతోంది. అయితే ఈ ఈవెంట్ కు ముగ్గురు స్పెషల్ గెస్ట్ లు రాబోతున్నారట. ఈ లిస్టులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకడు. అలాగే ప్రముఖ దర్శకులు రాజమౌళి, ప్రశాంత్ నీల్ అతిథులుగా హాజరుకానున్నారట.

ఇప్పటికే ప్రభాస్ ను సంప్రదించగా ఎన్టీఆర్ తో ఉన్న మంచి సన్నిహిత్యం నేపథ్యంలో లాంఛింగ్ ఈవెంట్ కు వస్తానని చెప్పారట. ఇక రాజమౌళి ప్రశాంత్ నీల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ ప్రభాస్ ఓకే ఫ్రేమ్ లో కనిపించిన దాఖలాలు లేవు .ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ 30 ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి ప్రభాస్ గెస్ట్ గా రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఈ ఇద్దరు స్టార్స్ ఓకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఫ్యాన్స్ కి పూనకాలు ఖాయమని అంటున్నారు.

Share post:

Latest