అల్లుడిపై పవన్ ప్రత్యేక శ్రద్ధ.. ఇప్పుడు ఏకంగా అది చేయడానికి రెడీ??

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఇప్పటికే 10కి పైగా సినిమాలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. తన మేనమామలు పవన్, చిరంజీవికి తగ్గ హీరోగా తన సత్తా చాటుతున్నాడు. డ్యాన్సులు, ఫైట్లు, డైలాగు డెలివరీ ఇలా అన్నింటిలో మెరుగుపడ్డ ఈ హీరో ఇప్పుడు విరూపాక్ష సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ యంగ్ హీరో హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అయితే కొన్ని నెలల క్రితం దురదృష్టం కొద్దీ ఒక యాక్సిడెంట్ వల్ల అతడి సినిమా లైఫ్ కి బ్రేక్ వచ్చింది. అదృష్టవశాత్తు యాక్సిడెంట్ నుంచి అతడు ప్రాణాలతో బయటపడగలిగాడు.

ఈ ప్రమాదంలో జరిగిన గాయాల నుంచి కోల్పోవడానికి ఈ మెగా హీరోకి చాలా సమయం పట్టింది. ప్రస్తుతానికైతే ఈ హీరో విరూపాక్ష అనే సినిమాను కంప్లీట్ చేశాడు. ఈ మూవీని మేనమామ పవన్ ప్రమోట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. నిజానికి సాయి ధరమ్‌ నటించిన రీసెంట్ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఇది కూడా ఫ్లాప్ అవుతే అతని కెరీర్ దాదాపు ముగిసిపోతుంది. అందుకే ఇప్పుడు తేజ్ కెరీర్ పై పవన్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడని స్పష్టం అవుతుంది.

గతంలో రిపబ్లిక్ మూవీ ఈవెంట్‌కి గెస్ట్‌గా వచ్చి సాయి ధరమ్‌ తేజ్‌కి హెల్ప్ అయ్యాడు పవన్. ఇప్పుడు విరూపాక్ష ట్రైలర్ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక వినోదాయ సీతమ్ రీమేక్‌లో తేజ్ పక్కన నటించడానికి కూడా ఒప్పుకున్నాడు. ఇప్పటివరకు పవన్ ఏ మెగా హీరో సినిమాలోనూ నటించలేదు. కానీ తేజ్ కోసం, తేజ్ కెరీర్ ను నిలబెట్టడం అతడు నటించాలని నిర్ణయించుకున్నాడు. తన సోదరి విజయదుర్గ కొడుకులైనా సాయి అన్నా అతని తమ్ముడు వైష్ణవన్నా పవన్ కి బాగా ఇష్టం. సాయి ధరమ్‌ తేజ్‌కి యాక్టింగ్ కోర్సు ఫీజు కట్టి బైక్ నుంచి మరీ అతని ఎంకరేజ్ చేశాడు పవన్.

అలా సినిమా ఇండస్ట్రీలో అతడు ఎంట్రీ ఇవ్వడానికి పవన్ కెరీర్ మారాడు. ఇప్పుడు మళ్లీ అతని కెరీర్‌ను నిలబెట్టడానికి ఈ పవర్ స్టార్ తన విలువైన సమయాన్ని కేటాయిస్తున్నాడు. ఈ మూవీ పవన్ కరిష్మాతో హిట్టయితే తేజ్ కి ఇక తిరుగు ఉండదు.

Share post:

Latest