ప‌వ‌న్ – తేజ్ మ‌ల్టీస్టార‌ర్ కు ఇంట్రెస్టింగ్ టైటిల్‌..?!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేష‌న్ లో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ సూప‌ర్ హిట్ `వినోద‌య సితం` రీమేక్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ప్ర‌ముఖ న‌టుడు సముద్ర ఖని దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ల‌పై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవ‌లె ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది. ఓ యువకుడు కారు యాక్సిడెంట్‌లో మరణించగా.. దేవుడు ఆ యువకుడికి రెండో అవకాశం ఇస్తాడు. ఆ తర్వాత ఎలా ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి అన్న‌దే ఈ సినిమా క‌థ‌. త‌మిళంలో దేవుడుగా సుమద్రఖని, వ‌రాన్ని పొందే వ్య‌క్తిగా తంబి రామస్వామి న‌టించారు.

తెలుగులో సుమద్రఖని పాత్ర‌లో ప‌వ‌న్‌, తంబి రామస్వా రోల్ ను తేజ్ పోషించ‌బోతున్నారు. ఇక‌పోతే ఈ రీమేక్ మూవీకి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ తెర‌పైకి వ‌చ్చింది. క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా మేక‌ర్స్ ఈ మూవీకి `దేవుడే దిగి వచ్చిన` అనే టైటిల్ ను పెట్టాల‌ని ప‌రిశీలిస్తున్నార‌ట‌. అయితే ఇంకా టైటిల్ ను ఫైన‌ల్ చేయ‌లేదు. త్వ‌ర‌లోనే టైటిల్ ను ఖ‌రారు చేసి అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌నున్నార‌ట‌.

Share post:

Latest