ఈ అమ్మాయిని కేవలం ప్రభాస్‌యే కాపాడాలి..!

కరోనాకి ముందు విడుదల అయిన పానీపట్ సినిమా ప్లాప్ అయింది. ఆ తరువాత వచ్చిన హమ్ దో హమరా దో, బచ్చన్ పాండే, భేదియా ఇక ఇప్పుడేమో షేహాజదా లాంటి సినిమా లు కూడా ప్లాప్ అయ్యాయి. ఈ ప్లాప్ సినిమాలన్నిటిలో ఉన్న నటి కృతి సనన్. అయితే ఈ సినిమాల మధ్య ఓటీటీలో రిలీజ్ అయి మంచి విజయం సాధించిన ‘మిమీ (Mimi)’ సినిమాలో కూడా కృతి సనన్ నటించారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి.

కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ కలిసి నటించిన సినిమా ‘షేహజదా’. ఈ సినిమాపై ఇద్దరి ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా కార్తీక్ ఆర్యన్ కి, కృతి సనన్‌కి పరాజయాన్ని మిగిల్చింది. ఇలా వరుస ప్లాప్‌ల వల్ల ఇండస్ట్రీలో హీరోయిన్ కెరీర్ నాశనమవుతుంది అని అంత అనుకున్నారు.

ఇక ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్’ సినిమా లో కనిపించడానికి రెడీ అయింది కృతి. ఎప్పటినుండో వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా 2023 జూన్ లో ప్రేక్షకుల ముందు రానుంది. ఈ సినిమా నుంచి విడుదల అయిన ట్రైలర్ గ్రాఫిక్స్ కారణంగా ట్రోలర్స్‌కి గురవుతుంది. ఇక అప్పటి నుంచి కృతి సనన్‌లో భయం మొదలయింది. మరి ప్రభాస్ కారణంగా అయినా ఆదిపురుష్ సినిమా హిట్ అయ్యి కృతి లైఫ్ సెట్ అవుతుందా లేదా అనేది చూడాలి. ప్రభాస్ మూవీ హిట్ అవుతే ఈ క్యూట్ యాక్ట్రెస్‌కి తెలుగులో కూడా మరిన్ని అవకాశాలు క్యూ కడతాయి.

Share post:

Latest