సైలెంట్ అయిపోయిన‌ సంక్రాంతి డైరెక్ట‌ర్స్‌.. నెక్స్ట్ ఉందా.. లేదా..?

టాలీవుడ్ ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. వీర సింహారెడ్డి సినిమాను గోపీచంద్ మలినేని తెర‌కెక్కించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించాడు. అలాగే బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేశాడు.

ఈ రెండు చిత్రాల్లోనూ శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే రెండు చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మించారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఈ సినిమాల తర్వాత అటు బాలయ్య ఇటు చిరంజీవి ఇద్దరు తమ తదుపరి ప్రాజెక్టులతో బిజీ అయ్యారు.

కానీ డైరెక్టర్లు మాత్రం సైలెంట్ అయిపోయారు. సంక్రాంతికి సూపర్ హిట్స్‌ కొట్టిన గోపీచంద్ మలినేని, బాబీ ఇంతవరకు తమ అదుపురి ప్రాజెక్టులపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో మూవీ లవర్స్ నెక్స్ట్ ఉందా.. లేదా.. అంటూ సంక్రాంతి డైరెక్టర్స్ ను ప్రశ్నిస్తున్నారు. మరి ఇప్పటికైనా వీరిద్దరూ మౌనం వీడతారా లేదా అన్న‌ది చూడాలి.

Share post:

Latest