ఆ సాంగ్ ఏంటి అంటూ పూజా హెగ్డేని ఏకిపారేస్తున్న నెటిజన్లు..

ప్రముఖ నటి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతంలో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ బుట్ట బొమ్మ వరుస విజయాలను అందుకొని తక్కువ సమయంలోనే స్టార్ హీరో గా ఎదిగింది. అయితే ఈ మధ్య మాత్రం వరుస ప్లాపులతో ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేస్తుంది. ఈ అమ్మడు నటించిన ఆచార్య, రాధే శ్యామ్, సర్కస్, మృగం లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి. వరుస ప్లాపులతో పూజా సినీ కేరిర్ త్వరలోనే ముగిసిపోయే అవకాశాలు ఉన్నాయని చాలా మంది అంచనా వేస్తున్నారు. ఇక ఇలాంటి సమయంలోనే పూజా కి ఒక బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా అనేది చాలా అవసరం.

కాగా తాజాగా ఆమె అప్‌కమింగ్ సినిమాకి సంబంధించిన పాట రిలీజ్ అయింది. ఈ పాటను చూసి చాలామంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహించిన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన పూజ హెగ్డే నటించింది. ఈ సినిమా ఈద్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాపై పూజా హెగ్డే చాలా ఆశాలు పెట్టుకుంది. ఇటీవలే ఆ మూవీ టీమ్ సినిమా లోని నైయో లగ్డా అనే పాటను రిలీజ్ చేసారు.

ఆ పాట విడుదల అయిన దగ్గర సమయం నుంచి విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఈ పాటలో కొరియోగ్రఫీ నుంచి కెమిస్ట్రీ వరకూ ఏ ఒకటీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ పాట కూడా ఒక చెత్త లాగా ఉంది ఇలాంటి సినిమాలను పూజా ఎందుకు ఎంచుకుంటుందంటూ ఆమెను చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఈ పాటతోనే సినిమా అట్టర్ ఫ్లాఫ్ అని భావిస్తూ వారు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా విజయం పూజాకి మాత్రమే కాదు సల్మాన్ ఖాన్ కి కూడా చాలా అవసరం. ఇక వీరిద్దరి కెరీర్ ని ఈ సినిమా నిలబెడుతుందో లేదో చూడాలి మరి.

 

Share post:

Latest