మంత్రివర్గంలో మార్పులు..మంత్రి రాజీనామా..?

ఏపీ మంత్రివర్గంలో మరొకసారి మార్పులు జరగనున్నాయా? జగన్ ముగ్గురు, నలుగురు మంత్రులని పక్కన పెట్టి..ఎమ్మెల్సీలని మంత్రివర్గంలో తీసుకుంటారా? అంటే ఇటీవల మీడియాలో వస్తున్న కథనాలని బట్టి చూస్తే కాస్త అవుననే అనిపిస్తుంది. కానీ ఎన్నికలకు ఇంకా 15 నెలలు మాత్రమే సమయం ఉంది..అలాంటప్పుడు ఇప్పుడు మంత్రివర్గంలో మార్పులు చేయడంలో ఒరిగేది ఏమి లేదు. కాకపోతే ఎమ్మెల్సీలకు కూడా అవకాశం ఇచ్చామని చెప్పుకోవడానికి ఉంటుంది.

కాకపోతే మొదట్లోనే మండలి రద్దు అని చెప్పి..ఎమ్మెల్సీ కోటాలో మంత్రులైన పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణలని మంత్రివర్గం నుంచి తప్పించి వారికి రాజ్యసభ ఇచ్చి..వారి స్థానంలో చెల్లుబోయిన వేణుగోపాల్, అప్పలరాజులని తీసుకున్నారు. ఆ తర్వాత 14 మంత్రులని మార్చి..కొత్తవారికి అవకాశం ఇచ్చారు. అయితే ఇప్పుడు ముగ్గురు, నలుగురుని మారుస్తారని ప్రచారం నడుస్తోంది. ఇక ఎమ్మెల్సీలుగా ఉన్న వారిని మంత్రివగ్రంలో తీసుకుంటారని అంటున్నారు. అది కూడా కీలక నేతలకు అవకాశం ఇస్తారని ప్రచారం నడుస్తోంది.

మంత్రి పదవి హామీ ఇచ్చిన మర్రి రాజశేఖర్‌కు ఇటీవలే ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన విషయం తెలిసిందే.  కానీ ఆయనకు మంత్రి పదవి డౌటే..ఎందుకంటే ఆల్రెడీ మర్రి ఉన్న చిలకలూరిపేట నుంచి విడదల రజిని మంత్రిగా ఉన్నారు. తోట త్రిమూర్తులుకు మంత్రి పదవి ఇస్తారనే టాక్ వస్తుంది. ఈయనకు మంత్రి పదవి ఇవ్వాలంటే ఓ కాపు మంత్రిని తప్పించాలి.

అదే సమయంలో సామాజికవర్గాల కూర్పులో భాగంగా తాను మంత్రి పదవికి రాజీనామా చేయాలని జగన్ ఆదేశిస్తే చేయడానికి రెడీ అని అప్పలరాజు అన్నారు. అంటే అప్పలరాజుని మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నారనే ప్రచారం వస్తుంది. చూడాలి మరి అసలు జగన్ మంత్రివర్గంలో మార్పులు చేస్తారో లేదో.