బాలకృష్ణపై పగబట్టిన చిరంజీవి.. అందుకే అలా చేస్తున్నాడా..?

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 షో ఇప్పటికే చాలా ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. బాలకృష్ణ ఈ షో కోసం మెగా కాంపౌండ్‌లో కూడా అడుగు పెట్టాడు. పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఆహాలో అన్‌స్టాపబుల్ టాక్ షోలో ముచ్చటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పటికే అన్‌స్టాపబుల్ షో రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. కానీ చిరంజీవి ఇంతవరకు ఆ షోకి హాజరు కాలేదు. దానికి మెగాస్టార్, అల్లు అరవింద్ ల మధ్య ఏమైనా గొడవలు అయ్యాయా అని చిరుని అడగితే, చిరంజీవి మాట్లాడుతూ ‘నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల కావొచ్చు లేదా కొన్ని కారణాల వాళ్ళ అల్లు అరవింద్ బాలకృష్ణ ని పిలిచారు. అందులో వింత ఏం లేదు’ అని చెప్పారు.

బాలకృష్ణ షోకి వెళ్ళకపోవడానికి కారణం చిరంజీవి బిజీ షెడ్యూలే కారణం అయితే మరి స్మిత నిజం షోకి వెళ్ళడానికి చిరు బిజీ గా లేరా అంటే మాత్రం సమాధానం లేదు. ఇప్పటికే రెండు సీజన్స్ పూర్తి చేసుకున్న బాలయ్య షోకి అటు రాజకీయాల్లో ఇటు సినిమాలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ని రప్పించగలిగారు కానీ చిరంజీవిని మాత్రం రప్పించలేకపోయారు. కానీ నిజం విత్ స్మిత షోకి మెగాస్టార్ హాజరయ్యారు. ఈ విషయంపై రకరకాల అనుమానాలు, ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.

బాలకృష్ణ పై చిరంజీవి పగబట్టాడని మరికొందరు నెటిజన్లు తీవ్ర కామెంట్ చేస్తున్నారు. ఇంతకుముందు నాగబాబు కూడా బాలకృష్ణ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. మొత్తం మీద వీరిమధ్య మాటలు లేవని గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ మాత్రం కేవలం రాజకీయాల కోసం బాలకృష్ణ వద్దకు వెళ్లాడని అంటున్నారు. దీంట్లో నిజం ఎంతో దేవుడికే తెలియాలి.

Share post:

Latest