ల‌వ్ లో ప‌డ్డ `లైగ‌ర్‌` బ్యూటీ.. త్వ‌ర‌లో గుడ్ న్యూస్ చెబుతుందా?

ఇటీవల కాలంలో నార్త్ సెలబ్రిటీలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. బాలీవుడ్ లో లవ్ బర్డ్స్ గా గుర్తింపు పొందిన కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా రీసెంట్ గా వివాహం చేసుకుని ఒకటయ్యారు. ఇప్పుడు మరో ప్రేమ జంట ఇప్పుడు బిటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. అన‌న్యా పాండే.. ఈ ముద్దుగుమ్మ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

చుంకీ పాండే కూతురుగా బాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెళ్లిన అన‌న్యా.. `స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2` తో హీరోయిన్ గా మారింది. తొలి సినిమాలోనే త‌న‌దైన అందం, న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత ప‌లు బాలీవుడ్ చిత్రాల్లో న‌టించిన అన‌న్యా.. `లైగ‌ర్‌` మూవీతో టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయింది. రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం గ‌త ఏడాది విడుద‌లై బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకోవాల‌నుకున్న అన‌న్యాకు నిరాశే ఎదురైంది.

ప్ర‌స్తుతం బాలీవుడ్ లో ప‌లు సినిమాలు చేస్తున్న అన‌న్యా పాండే.. బాలీవుడ్ హీరో ఆదిత్యా రాయ్ కపూర్ తో లవ్ లో ప‌డింద‌ని టాక్ వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ప‌లు మార్లు వీరిద్ద‌రూ జంట‌గా కనిపిస్తున్నారు. అన్ని ఈవెంట్స్ కి క‌లిసే వెళ్తూ ఉన్నారు. తాజాగా `ది నైట్ మేనేజర్ `అనే వెబ్ సిరీస్ ప్రీమియర్ సందర్భంగా అనన్యా పాండే ఆదిత్యా రాయ్ జంటగా కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య సంథింగ్.. సంథింగ్ అంటూ బీటౌన్ లో టాక్ న‌డుస్తోంది. త్వ‌ర‌లోనే అన‌న్యా పాండే కూడా గుడ్ న్యూస్ చెప్ప‌బోతోందంటూ చ‌ర్చించుకుంటున్నారు.

Share post:

Latest