అదిరిపోయే స్పీచులతో ఫేమస్ అవుతున్న హైపర్ ఆది.. అందుకు కారణం అదే??

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆర్టిస్ట్ హైపర్ ఆది. బుల్లితెరపై అనేక షోస్ లో తన కామెడీ పంచులతో అలరించే ఆది ఇప్పుడు వెండితేర పై కూడా నటిస్తున్నాడు. మజ్ను, ధమాకా, బీమ్లా నాయక్, అల వైకుంఠపురములో లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. ఇక ఇటీవలే తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘సార్’ సినిమాలో హైపర్ ఆది నటించాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హైపర్ ఆది త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ప్రశంశల వర్షం కురిపించాడు.

సాధారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటే హీరో, హీరోయిన్, నిర్మాతలు, డైరెక్టర్స్ ఎక్కువగా మాట్లాడతారు. క్యారెక్టర్ ఆర్టిస్తులకి పెద్దగా అవకాశాలు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చిన కూడా ఒకటి రెండు మాటలు మాట్లాడి పక్కకి వెళ్ళిపోతుంటారు. అలాంటిది సార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆది ఎక్కువ సమయం తీసుకోడంతో పాటు తన కామెడీ పంచులతో అందరినీ నవ్వించాడు.

స్టేజ్‌పై హైపర్ ఆది మాట్లాడుతూ.. “మాటలకూ రూపం వస్తే, అది మాట్లాడే మొదటి మాట థాంక్ యు త్రివిక్రమ్ అని చెబుతాయి” అని హైపర్ ఆది త్రివిక్రమ్‌కి పెద్ద బిస్కెట్ వేసాడు. అలాంటి ప్రసంగాలు త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కి కొత్తేమీ కాదు. అయితే ఇలాంటి ప్రసంగాలు మాత్రం సోషల్ మీడియాలో అతి తక్కువ సమయంలోనే ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. నిజానికి ఇలాంటి వెర్రి ప్రసంగాల వాళ్ళ కూడా సినిమా ఎక్కువగా పాపులర్ అవుతుంటుంది. అందుకే మూవీ మేకర్స్ కూడా హైపర్ ఆది లాంటి పొగడ్తల రాయుళ్లు స్టేజ్ పై ఎంత మాట్లాడినా పెద్దగా పట్టించుకోరు.

Share post:

Latest