నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంతమంది దగ్గర వర్క్ చేశాడంటే..!?

నేచురల్ స్టార్ నాని అష్టాచమ్మా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న నాని వరుస సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లోనే నాచురల్ స్టార్ గా ఎదిగాడు. అలాంటిది ఈ నేచురల్ స్టార్ హీరోగా మారటానికి ముందు టాలీవుడ్ లో ఉన్న చాలా మంది అగ్ర దర్శకులు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ముందుగా నాని లెజెండ్రీ దర్శకులు బాబు గారి దగ్గర శ్రీకాంత్- స్నేహ నటించిన రాధాగోపాలం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.

Nani on Twitter: "I am very very proud to say that I belong to Bapu school  .. Thank you for everything sir. http://t.co/44XD3ua81t" / Twitter

ఆ తర్వాత దర్శకుడు శ్రీనువైట్ల దగ్గర కూడా కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాడు. అదే సమయంలోనే భిన్నమైన సినిమాల దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ అష్టాచమ్మా అనే సినిమా కథను రెడీ చేసుకుని కొత్త వాళ్లను హీరోగా పెట్టి సినిమా తీద్దామని అనుకుంటున్న సమయంలో ఇంద్రగంటికి నాని కనిపించాడు. దాంతో నానినే హీరోగా పెట్టి అష్టాచమ్మ సినిమా తీశాడు. ఆ సినిమా మంచి హిట్ అవ‌ట‌మే కాకుండా నాని నటనకు మంచి మార్కులు కూడా పడ్డాయి.

Nani and Mohana Krishna Indraganti to join again for a new film "Telugu  Movies, Music, Reviews and Latest News"

ప్రస్తుతం నాని టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా నిలిచాడు. నాని ఇప్పుడు దసరా సినిమా చేస్తున్నడు. ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని ఈ సినిమాతో తొలిసారిగా పాన్ ఇండియా లెవెల్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా మాత్రం హిట్ అయితే నాని క్రేజ్ మరో లెవెల్ కు వెళుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. విధంగా నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చి హీరోగా మారి టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరిగా నిలిచాడు.

Share post:

Latest