ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బ‌కు వ‌ణికిపోయిన హాలీవుడ్ అవార్డు సంస్థ‌.. అట్లుంటది మరి!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్‌` చిత్రం గ‌త ఏడాది కాలం నుంచి ఎన్నో రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది. మ‌రెన్నో ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుల‌ను కైవ‌శం చేసుకుంటోంది. ప్ర‌స్తుతం అంతర్జాతీయ వేదికలపై ఆర్ఆర్ఆర్ ప్రభంజనం సృష్టిస్తోంది. రీసెంట్ గా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు ఫంక్షన్ లో ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ఐదు అవార్డులు ఈ చిత్రానికి దాసోహం అయ్యాయి. అలాగే మ‌రోవైపు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ అరుదైన ఘనతను తన సొంతం చేసుకున్నాడు.

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు ఫంక్షన్ కు రామ్ చరణ్ ప్రజెంటర్ గా విచ్చేశారు. ఈ అవార్డు ఫంక్షన్ లో ఆయనకు బెస్ట్ వాయిస్ ఓవర్ అవార్డును ప్రకటించారు. ఇక ఈ అవార్డు ఫంక్ష‌న్ కు రామ్ చరణ్ తో స‌హా రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా హాజరయ్యారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఈ వేడుకలో మిస్ అయ్యారు. ఈ మొత్తం కార్యక్రమంలో చరణ్ హాజరై హైలెట్‌గా నిలవడంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ఒక హీరోగా న‌టించాడు.. ఆయ‌న్ను ఎందుకు ప‌క్క‌న పెట్టేశారంటూ హెచ్ సి ఏ అవార్డ్స్ సంస్థపై ఫ్యాన్స్‌ విరుచుకుప‌డ్డారు. దెబ్బ‌కు వ‌ణికిపోయిన స‌ద‌రు సంస్థ‌.. ఎన్టీఆర్ రాకపోవడానికి కారణాలను తెలిపింది. ఈ అవార్డుల కార్యక్రమానికి ఎన్టీఆర్‌ను ఆహ్వానించామ‌ని, కానీ ఆయ‌న ఇండియాలో ఓ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండ‌టం, ఆ త‌ర్వాత ఆయ‌న‌ సోదరుడు తారకరత్న మరణించడం కార‌ణంగా ఎన్టీఆర్ ఈవెంట్ కు రాలేక‌పోయారంటూ స‌ద‌రు సంస్థ క్లారిటీ ఇచ్చింది. అలాగే త్వరలోనే తారక్ మా నుంచి అవార్డు అందుకుంటారు అని తెలిపింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త శాంతించారు.

Share post:

Latest