భాష రీమేక్ రాబోతోందా? రజనీ అభిమానులు ఎందుకని డీలా పడుతున్నారు మరి?

రజనీ… ఒక పేరు కాదు, ఒక బ్రాండ్. అతని పేరు తెలియని వారు యావత్ భారత దేశంలోనే ఎవరూ వుండరు. అంతలా రజనీ తనడైన స్టైల్ తో, నటనతో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక అతని జీవితంలో భాష అనే సినిమా ఓ కలికితురాయి. ఆ సినిమా తరువాత రజనీ పేరు దిగంతాలకు చేరింది. ఆ సినిమా కేవలం తమిళంలోనే కాకుండా చాలా భాషల్లో డబ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో రీమేక్స్, ప్రీమిక్స్, సీక్వెల్స్ ఇలా రకరకాల సినిమాల ట్రెండ్ నడుస్తోంది. వీటితో పాటు రీ రిలీజ్ ల ట్రెండ్ కూడా బాగానే నడుస్తోంది.

ఈ క్రమంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన బాషా సినిమా రీమేక్ తెరపైకి రావడం గమ్మత్తైన విషయం. దాంతో తమిళ తంబీల ఫోకస్ ఇపుడు బాషా సినిమాపనే పడింది. అప్పట్లో భాషా ఓ సెన్షేషన్. ఈ సినిమాలో రజినీ లుక్, డైలాగ్స్, సాంగ్స్.. ఫైట్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఫ్యాన్స్ కి అప్పట్లో పూనకాలు తెప్పించాయి. బాషా సినిమాకు ఇప్పటికీ అదే క్రేజ్ కొనసాగడం విశేషం. ఇక ఆ పాత్రలో కూడా రజినీకాంత్ తప్ప ఇంకెవరినీ ఉహించుకోలేరు అభిమానులు. అంతలా ఆ సినిమా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

ఇక అలాంటి గొల్డెన్ మూవీ రీమేక్ లో రజనీ కాకుండా మరో హీరో అంటే అభిమానులు నిరాశ పడతారు కదా. ఇక్కడ కూడా అదే జరిగింది. బాషా సినిమాను ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణువర్ధన్.. రీమేక్ చేయాలని భావిస్తున్నాడట. అయితే ఇందులో రజనీని కాకుండా అజిత్ తో చేయాలని అనుకుంటున్నాడట. ప్రస్తుతం రజనీ కాంత్ ఏజ్ 72 ఏళ్ళు. కాబట్టి ఈ సమయంలో అతనిని ఇబ్బంది పెట్టడం దేనికని అజిత్ ని కలిశాడట విష్ణు వర్ధన్. దాంతో రజనీ అభిమానులు బాధపడుతున్నారట.